బీపీ వచ్చినప్పుడు,అభిమానం ఉప్పొంగినప్పుడు వచ్చే రియాక్షన్ దాడులు.. జగన్ డైలాగ్ వైరల్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలలో టిడిపి కూటమి ఘన విజయం సాధించగా వైసిపి ఘోర పరాజయం పాలయింది. ఇక ఆ తర్వాత ఏపీలో మళ్లీ దాడుల పర్వం మొదలైందని, వైసీపీ శ్రేణులపై టిడిపి నేతలు, కార్యకర్తలు హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ తమ్ముళ్ళు జగన్ నీవు చెప్పిన మాటే .. నీవు చూపిన బాటే అంటున్నారు.

ఏపీలో దాడులపై జగన్ స్పందన
ఏపీలో జరుగుతున్న దాడులు, ఘర్షణలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టిడిపి ముఠాలు స్వైర విహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని, గ్రామ సచివాలయాలు, ఆర్ బి కే లాంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

YCP fans with bp and excitement reaction turns into attacks jagan dialogue viral

గవర్నర్ పట్టించుకోవాలన్న జగన్
వైసిపికి చెందిన నాయకులు కార్యకర్తలు రక్షణ లేకుండా పోయిందని అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ కూడా నిస్తేజంగా మారిపోయిందని అభిప్రాయపడ్డారు. ఇక గవర్నర్ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని దాడులకు అడ్డుకట్ట వేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే వైసిపి వారు రెచ్చగొట్టినా దాడులకు దిగవద్దని సంయమనం పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

దాడులపై తాజా మాజీ సీఎం గతంలోనే పర్మిషన్ ఇచ్చారని సెటైర్లు
అయితే ఈ సమయంలో గతంలో 2019 ఎన్నికలలో గెలిచిన తరువాత టిడిపి శ్రేణులపై వైసీపీ దాడులు కొనసాగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు తమ్ముళ్లు జగన్ వ్యాఖ్యలను వైరల్ చేస్తూ దాడుల విషయంలో తాజా మాజీ సీఎం గతంలోనే పర్మిషన్ ఇచ్చారని సెటైర్లు వేస్తున్నారు.

నాడు జగన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్చల్
బీపీ వచ్చినప్పుడు, అభిమానం ఉప్పొంగినప్పుడు, బూతులు మాట్లాడిన వారిపై ఉన్న వ్యతిరేకత ఇలా రియాక్షన్ లా కనిపిస్తుందని అందులో తప్పేముందని నాడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తన అభిమానులకు బిపి వచ్చి దాడులు చేశారని, నాడు దాడులను సమర్థించిన జగన్ ఇప్పుడు దాడుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.

జగన్ ఇప్పుడు గాంధీ గిరి తీసుకున్నారా? ప్రశ్నిస్తున్న తెలుగుతమ్ముళ్ళు
మీ వాళ్ళు అభిమానం ఉప్పొంగినా, బీపీ వచ్చినా దాడులు చేయొచ్చా అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో జగన్ మాట్లాడిన వీడియోను వైరల్ చేస్తున్నారు. అప్పుడు అలా మాట్లాడిన జగన్ ఇప్పుడు గాంధీ గిరి తీసుకున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. నాడు టిడిపి శ్రేణులపై దాడులు చేసినప్పుడు జగన్ కు ఆ బాధ తెలియలేదా అని ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+