కోటంరెడ్డిపై వైసీపీ అధినాయకత్వం కీలక నిర్ణయం..!!
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడి పైన వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.
నెల్లూరు జిల్లా అసమ్మతిపై వైసీపీ హైకమాండ్ చర్యలు ప్రారంభించింది. నెల్లూరు జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిర్ణయాలను తప్పు బడుతున్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. ఆనం రామనారాయణ రెడ్డి..కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాల్లో వారి స్థానల్లో కొత్త వారికి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు రూరల్ లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి పార్టీ బాధ్యతలు కేటాయించింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో కోటంరెడ్డి టీడీపీలోకి ఎంట్రీ పైనా కొత్త చర్చ మొదలైంది.

కోటంరెడ్డి సోదరుడిపై సస్పెన్షన్ వేటు
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడి పైన వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కోటంరెడ్డి గిరధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పండ్ చేస్తూ పార్టీ నాయకత్వం ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావటంతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు గిరిధర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో స్పష్టం చేసారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తన అన్నతో పాటుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తన సోదరుడిని తన నుంచి దూరం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే పైన చర్యలకు సిద్దం అవుతున్న క్రమంలోనే ముందుగా సోదరుడు గిరధర్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా వైసీపీలో చర్చ సాగుతోంది.

కోటంరెడ్డి అడుగులు ఎటువైపు
వైసీపీ నుంచి కోటంరెడ్డి దూరం అవుతున్నట్లు ప్రకటించాక ఆయన అడుగులు ఆసక్తి కరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కోటంరెడ్డి ఇప్పటికే స్పష్టం చేసారు. చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసారు. ఇదే సమయంలో చంద్రబాబు కాదంటే తనకు ప్రత్యామ్నాయ పార్టీలు ఏంటనేది కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు కోటంరెడ్డి పార్టీలో చేరిక పైన తమకు ఎటువంటి సమాచారం లేదని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు. కోటంరెడ్డి తమకు వేధింపులకు గురి చేసారని..అటువంటి వ్యక్తిని తమ పార్టీలోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారని కొంత మంది నేతలు జిల్లా నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ఇదే సమయంలో కోటంరెడ్డి పార్టీలో చేరిక పై చంద్రబాబు - లోకేష్ ఎటువంటి ప్రస్తావన చేయలేదని నెల్లూరు అర్బన్ - రూరల్ నేతలు చెబుతున్నారు.

ఆనం - కోటంరెడ్డి మౌనం వెనుక
ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ మౌనం పాటిస్తున్నారు. రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్న వేళ ఈ ఇద్దరి అడుగులు టీడీపీ వైపే అనే ప్రచారం సాగుతోంది. కానీ, జిల్లా టీడీపీ నేతల నుంచి మాత్రం భిన్నంగా స్పందన కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ అధినాయకత్వం వీరిద్దరి నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివిటీని పెంచింది. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు టీడీపీ నుంచి పోటీ చేసినా..మద్దతు లేకుండా చేయాలనేది వైసీపీ నాయకత్వం లక్ష్యం. అటు టీడీపీ అధినాయకత్వం వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది. టీడీపీ -జనసేన పొత్తు వేళ టీడీపీ నుంచి అవకాశం ఉంటుందా లేదా అనే చర్చ ఇప్పుడు నెల్లూరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతోంది. ఇదే సమయంలో వైసీపీ నాయకత్వం ఈ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. దీంతో..ఇప్పుడు నెల్లూరు జిల్లా కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications