టిడిపి చేతిలో వైసిపి సాక్ష్యం : అడ్డంగా వైసిపి దొరికిపోయింది : చంద్రబాబు..!
టీడీపీ డేటా చోరీ విషయంలో సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటారని..కానీ ఎక్కడో.. ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందని..వారు అడ్డంగా దొరికిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ సాక్ష్యాన్ని తానే బయట పెడతానని వెల్లడించారు.
వైసిపి వదిలేసిన సాక్ష్యం..
తెలుగుదేశంతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడలేదని, అలాగే ఆంధ్రప్రదేశ్‌తో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని, టీడీపీ డేటా దొంగలు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలతో ఈ అంశాలు పంచుకున్ఆనరు. టీడీపీ డేటా చోరీ విషయంలో సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుం టారని, కానీ ఎక్కడో, ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందన్నారు. ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఆ సాక్ష్యాన్ని బయట పెడతానని చంద్రబాబు పార్టీ నేతల కు వివరించారు. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు, నరేంద్రమోదీకి ఓటేసినట్లేనని చంద్రబాబు అన్నారు.

ప్రజలే అడ్డుకోవాలి..
ఫారం-7లో 95శాతం బోగస్ అని ఈసీ అధికారే చెప్పారన్నారు. ఓట్ల తొలగింపు కుట్రలను ప్రజలే అడ్డుకోవాలని, మా ఓ ట్లు తొలగించి మమ్మల్నే ఓటడుగుతారా.. అని... వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను ప్రజలంతా నిలదీయాలన్నారు. అంతేగా క మమ్మల్ని బతికుండగానే చంపేస్తారా అని ప్రశ్నించాలని, రేపు మా ఆస్తులు కూడా ఇలాగే గల్లంతు చేస్తారా..అని... రేపు బూత్‌ల వద్ద ఓటర్లే వైసీపీని నిలదీయాలని పిలుపునిచ్చారు.ఏపీ నీళ్లకు మోకాలడ్డే కేసీఆర్‌తో జగన్ దోస్తీ చేస్తున్నా రని, సొంత ప్రాంతానికి నీళ్లిచ్చినా జగన్‌కు కంటిమంటేనని చంద్రబాబు అన్నారు. నీళ్లు సముద్రంలో కలిసినా టీ ఆర్ఎస్‌కు ఇష్టమేనని, కానీ వృథాగా పోయే నీళ్లు వాడుకున్నా కేసీఆర్ ఓర్వలేకపోతున్నారన్నారు.ఏపీ నదుల అను సందానంపై దేశం మొత్తం ప్రశంసిస్తుండగా కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రం తట్టుకోలేకపోతున్నారన్నారు. ఆంధ్రా వాళ్లు ఊడిగం చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని చంద్రబాబు ఆరోపించారు.












Click it and Unblock the Notifications