YCP: సోషల్ మీడియాలో దూసుకెళ్తోన్న వైసీపీ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. 4500 మంది సోషల్ మీడియా వారియర్లతో ముందుకెళ్తోంది.రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తోంది. పార్టీ ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తప్పుడు ఆరోపణలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తిప్పుకొడుతోంది.
ఎలక్ట్రాని, ప్రింట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపక్షాల ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఓటరుకు చేరువయ్యేలా పని చేస్తున్నామని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి తెలిపారు.
అనేక ప్లాట్‌ఫారమ్‌లలోని పార్టీ అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లతో పాటు ఫాలోయింగ్ కూడా ఉంది. పార్టీకి సోషల్ మీడియాలో దాదాపు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఓటరును చేరుకోవడమే తమ లక్షమన్నారు. తమకు సోషల్ మీడియాలో రీచ్ చాలా ఎక్కువగా ఉందన్నారు.మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ 'X'లో YSRCP అధికారిక ఖాతా 8.86 లక్షల మంది ఫోలోవర్స ఉన్నట్లు చెప్పారు. పార్టీ యూట్యూబ్ ఛానల్ కు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నాని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.72 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ఫేస్‌బుక్ పేజీకి 1.2 మిలియన్ల మంది అభిమానులు ఉన్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications