చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తా..!!

వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ మరణంతోనే టీడీపీ చనిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ చంద్రబాబు వెన్ను పోటు నుంచి పుట్టిన పార్టీగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ టీడీపీ ఏర్పాటు చేసే సమయంలో చంద్రబాబు ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. అవకాశ వాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన నేతగా విమర్శించారు. ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా అని అంబటి ప్రశ్నిం చారు. ఇతర పార్టీల జెండాలు పక్కన పెడితే కానీ టీడీపీ జెండా ఎగరలేదని ఎద్దేవా చేసారు.

అంబటి వ్యాఖ్యలు
చంద్రబాబు తెలుగు దేశం కు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదని అంబటి పేర్కొన్నారు. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్ చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చూస్తే చేయలేకపోతున్నామని అంటున్నారని చెప్పుకొచ్చారు. సిద్దాంతాలతో పని లేకుండా అధికా రమే పరమావధిగా ఎవరితోనైనా జత కడతారని విమర్శించారు. అధికారం కోసం బీజేపీతో, తరువా త కమ్యూనిస్ట్ లతో, మళ్ళీ బీజేపీతో, ఇప్పుడు జనసేనతో జత కట్టారన్నారు. అవసరం తీరిన తరువాత ఆ పార్టీలను పక్కకుతోసేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ అంబటి ధ్వజమెత్తారు. ఇక, చంద్రబాబు వారసత్వంను లోకేష్ రాజా పుణికిపుచ్చుకున్నారని విమర్శించారు.

ycp-leader-ambati-ramababu-made-interesting-comments-on-chandra-babu

రెడ్ బుక్ రాజ్యంగం
గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా సంపాదించారని అంబటి ఆరోపిం చారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయిన తరువాత అధికార మదంతో మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. తన రెడ్‌బుక్ చూసి గుండెపోటు, బాత్రూమ్‌లో జారి పడిపోతున్నారంటూ వ్యం గ్యంగా మాట్లాడుతున్న లోకేష్‌ కు ముందుంది ముసళ్ళ పండుగ అని వ్యాఖ్యానించారు. ఈ రోజు వేధింపులకు గురవుతున్న ప్రతి ఒక్కరూ తమ బుక్కుల్లో లోకేష్ పేరు రాసుకుంటున్నారని అంబటి చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్‌ల కోసం పోలవరంను తాకట్టుపెట్టారని అంబటి విమర్శించారు. డయాఫ్రం వాల్ వేసే సిన తరువాత జగన్ కాఫర్‌ డ్యాంలను క్లోజ్ చేయలేదంటూ అర్థంలేని మాటలు మాట్లాడారని గుర్తు చేసారు.

నిరూపించాలి
అధికారంను అడ్డం పెట్టుకుని దోచుకోవడం, జనానికి పంచడం, ఓట్లు కొనుగోలు చేయ డం చంద్రబాబుకు అలవాటని అంబటి మండిపడ్డారు. పోలవరం నిధులు ప్రభుత్వానికి మళ్లించి నట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని అన్నారు. పోలవరాన్ని సర్వనా శనం చేసింది చంద్రబాబుయే నని విమర్శించారు. పోలవరం నిర్మాణం సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరానికి ముందుగా డబ్బులు ఖర్చు పెట్టిన తరువాత కేంద్రం రీయింబర్‌ చేయడానికి కేంద్రంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇందులో డబ్బుల మళ్లింపు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+