పులివెందులలో టీడీపీ గెలుపుతో నెక్స్ట్ ఇక..!!
పులివెందులలో టీడీపీ గెలిచింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం తో ఇప్పుడు జగన్ ఇలాకాలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. అప్రజాస్వామికంగా టీడీపీ గెలిచిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, టీడీపీ మాత్రం ఇప్పుడే పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయని చెబుతోంది. పులివెందులతో పాటుగా ఒంటిమిట్టలోనూ టీడీపీ విజయం సాధించింది. దీంతో, ఇక ఇప్పుడు టీడీపీ గెలుపుతో పులివెందులలో నెక్స్ట్ రాజకీయాల పైన అంచనాలు మొదలయ్యాయి.
పులివెందుల, ఒంటిమిట్టలో విజయం తో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. మూడు దశాబ్దాల తరువాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. ఇక, టీడీపీ గెలుపు పైన వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. పులివెందులలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్నిక జరిపారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేసారంటూ ఆధారాలు చూపించారు. సమాజానికి దిక్సూచీగా నిలవాల్సిన పోలీసులు ఇలాగేనా చేసేది అని ప్రశ్నించారు. పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని.. టీడీపీ నేతలే నమ్మటం లేదని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు, లోకేష్ మాటలను టీడీపీ నేతలు నమ్మటం లేదని నాని వ్యాఖ్యానించారు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఓట్లు ఎలా వేసారంటూ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ ప్రకారమే రీ పోలింగ్ నిర్వహించిందని ఆరోపించారు. పులివెందులలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు ప్రజలు అంతా చూసారని చెప్పారు. చంద్రబాబు సర్కార్ ప్లాన్ ప్రకారమే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టిందని.. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని చెప్పుకొచ్చారు. ఉన్నతాధికారులు సైతం టీడీపీకి అనుకూలంగా పని చేసారని మండిపడ్డారు. సీసీ ఫుటేజ్, వెబ్ క్యాస్టింగ్ ఇవ్వటానికి ఎన్నికల సంఘానికి భయం ఎందుకని ప్రశ్నించారు. పోలింగ్ బూతుల వద్ద ఎక్కడా మహిళలు కనిపించ లేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పులివెందుల ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారని పేర్ని నాని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications