జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షల వేళ కీలక పరిణామాలు..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పర్యటన పైన ఆంక్షలు.. నోటీసులతో రెండు సార్లు నెల్లూరు పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు జగన్ నెల్లూరు జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంటికి వెళ్లనున్నారు. ఈ పర్యటన వేళ పోలీసులు ఆంక్షల తో అనుమతి ఇచ్చారు. వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేసారు. దీంతో, పార్టీ నేతలు ఈ పర్యటన వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మాజీ సీఎం జగన్ పర్యటన వేళ నెల్లూరు లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. జగన్ పర్యటనకు జిల్లా పోలీసులు ఆంక్షలతో అనుమతి ఇచ్చారు. హెలిపాడ్ నుంచి జైలుకు.. అక్కడ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లేలా టూర్ షెడ్యూల్ ను పార్టీ నేతలు ఖరారు చేసారు. కాగా, నెల్లూరు వైసీపీ నేతలకు పోలీస్ నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులకు నోటీసులు చేరాయి. తాజాగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు అందజేశారు. జనసమీకరణ చేయవద్దని నిర్దేశించారు. మాజీ మంత్రి అనిల్ కు పోలీసులు నోటీసు లు జారీ చేసారు. దీంతో.. జగన్ నెల్లూరు పర్యటన వేళ ఆంక్షల పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, మాజీ మంత్రులు పోలీసుల ఆంక్షల పైన స్పందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా జగన్‌ను, జనాన్ని అడ్డుకోలేరని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సీరియస్ వ్యాఖ్యలు చేసారు. జగన్ నెల్లూరు వెళుతుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండి పడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ స్వేచ్ఛగా తిరిగారని గుర్తు చేశారు. మరో మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రజల్లోకి వెళ్లటానికి జగన్ కో రూలు..చంద్రబాబు, లోకేష్ కు ఒక రూలు ఉంటుందా అని ప్రశ్నించారు. జగన్ ఫొటో స్టేటస్ పెట్టుకున్న నోటీసులు ఇస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు ఉడత ఊపులకు జగన్ భయపడరని.. జగన్ ను ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరని.. జగన్ ను చూడగానే ప్రజలకు ధైర్యం వస్తుందని పేర్ని నాని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications