పెన్షన్ల వివాదంతో గెలుపు లెక్క మారిందా...!!
ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. ఏపీలో పెన్షన్ల వ్యవహారం రాజకీయ వివాదంగా మారింది. ఇదే అంశంపై తాజాగా వైసిపి ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏపీలో చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పెన్షన్ల వివాదానికి చంద్రబాబు వ్యవహార శైలే కారణమని ప్రజల పేర్కొన్నారు. చంద్రబాబు తన స్వార్థం తప్ప మరేమీ చూసుకోలేదు అన్నారు. ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారు ఆయనకే తెలియడం లేదన్నారు. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు విషయం మీద ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
పెన్షన్ పంపిణీ
డబ్బులు లేవని ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏం జరుగుతుందో ప్రజలకు పూర్తి అవగాహన ఉందన్నారు. చంద్రబాబు తీరు చూసిన తర్వాత లబ్ధిదారులకు జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయి అన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో ఎవరైతే విమర్శించారో ఈరోజు వాళ్లే లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచాలని అంటున్నారని వివరించారు. గతంలో ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ జరిగేదన్నారు. దీని ద్వారా తొలి రోజునే 80% పంపిణీ పూర్తయ్యదని వివరించారు.

చంద్రబాబు ఒత్తిడి తో
ప్రస్తుతం రెండో రోజు వరకు 60 శాతం పంపిణీ మాత్రమే జరిగిందని చెప్పుకొచ్చారు. లబ్బిదారులు స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సిన రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనికి కారణమైన చంద్రబాబు పైన లబ్ధిదారులంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత తెలుసుకున్న టిడిపి నేతలు తమను టార్గెట్ చేస్తున్నారని వివరించారు. ప్రజలకు మంచి చేయటం చంద్రబాబు ఉద్దేశం కాదన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఈ రెండు రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది అన్నారు. అది రేపు ఎన్నికల్లో తెలుస్తుందని వివరించారు. అధికారుల్లో 100% ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు ఉంటారని సజ్జల ప్రశ్నించారు.
అదికారుల బదిలీ వెనుక
అధికారుల్ని డిమారలైజ్ చేసే అందుకే తప్పుడు ఆరోపణ చేస్తున్నారని చెప్పారు. పడ్డాని సభలో పోలీసుల పాత్ర తక్కువగా ఉంటుందన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి వైఫల్యాన్ని రాష్ట్ర పోలీసులపై రుద్దే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కూటమిలో ఉన్న కారణంగానే ఒత్తిడి చేయించి మరి అధికారుల్ని బదిలీ చేయించారని ఆరోపించారు. తాము వ్యవస్థలను మేనేజ్ చేయాలని అనుకోవడం లేదన్నారు. జగన్ ప్రజల్ని నమ్ముకున్నారని వివరించారు. తాము ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారుల వల్ల గెలిచారు అని అనటానికి వీలు లేకుండా ఇప్పుడు కూటమికి అవకాశం కోల్పోయిందని సజ్జల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications