టీడీపీ పని అయిపోయింది- చంద్రబాబే తేల్చేసారు : ఇదీ ఆధారం- సాయిరెడ్డి ..!!
టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ పని అయిపోయిందంటూ చెప్పుకొచ్చారు. ఇందు కోసం చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడిన ఒక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసారు. పార్టీ నిర్వీర్యం అయిపోతోందని చంద్రం అన్నయ్యే తేల్చేశారంటూ సాయిరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో గతంలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. పార్టీ రెబల్ ఎంపీ రఘురామ రాజును సాయిరెడ్డి టార్గెట్ చేసారు.
చంద్రబాబు వ్యాఖ్యల వీడియోతో.. సాయిరెడ్డి పోస్టింగ్..
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో చేసిన కామెంట్స్ ను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత సాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసారు. ఆ వీడియోలో పార్టీ నేతలను చంద్రబాబు మందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. వాటి ఆధారంగా సాయిరెడ్డి పోస్టు చేసారు. అందులో.. "మొన్న అచ్చన్న...నిన్న స్వయంగా చంద్రబాబే "పార్టీ లేదు-బొక్కాలేదు" అనేశాడే! రోజురోజుకూ పార్టీ నిర్వీర్యం అయిపోతోందని మా చంద్రం అన్నయ్యే తేల్చేశాడు. ఎల్లో మీడియా ఎన్ని బాకాలు ఊదినా...పెగ్గురాజు ఢిల్లీలో ఎంత పేలినా ఇక లాభం లేదు. టీడీపీకి 2024 చివరి ఎన్నికలు. తమ్ముళ్లూ సర్దుకోండిక!.." అంటూ సాయిరెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా నిత్యం చంద్రబాబు- లోకేశ్ టీడీపీ నేతలను టార్గెట్ చేసే సాయిరెడ్డి..తాజాగా పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

తాజాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి విషయంలో ఛైర్మన్ తొలుత సాయిరెడ్డి పేరు ప్రతిపాదించినా..తరువాత ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నిక అయ్యారు. ఇది వరుసగా రెండోసారి. పబ్లిక్ అకౌంట్స కమిటీ కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ ఖాతాలను పరిశీలించనుంది.
మొన్న అచ్చన్న...నిన్న స్వయంగా చంద్రబాబే "పార్టీ లేదు-బొక్కాలేదు" అనేశాడే! రోజురోజుకూ పార్టీ నిర్వీర్యం అయిపోతోందని మా చంద్రం అన్నయ్యే తేల్చేశాడు. ఎల్లో మీడియా ఎన్ని బాకాలు ఊదినా...పెగ్గురాజు ఢిల్లీలో ఎంత పేలినా ఇక లాభం లేదు. టీడీపీకి 2024 చివరి ఎన్నికలు. తమ్ముళ్లూ సర్దుకోండిక! pic.twitter.com/IDGpPBfC8s
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 14, 2022
తనకు అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి సాయిరెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఇక, పార్టీ రెబల్ ఎంపీ రఘురామ వర్సస్ సాయిరెడ్డి అన్నట్లుగా నిత్యం సోషల్ మీడియా వేదికగా పోస్టుల వార్ కొనసాగుతోంది. తాజాగా.." నీకు పార్లమెంట్లో పనుందా? "రొచ్చుబండ" పెట్టలేకపోతున్నావా? పార్లమెంట్లో నీకు ఓనామాలైనా వచ్చా విగ్గురాజు? ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ పరిధిలోనే అప్పులు చేస్తుందిరా గబ్బు! ఆ విగ్గు తీసి ఆలోచించు. కనీసం బుర్రకేమైనా ఎక్కుతుందేమో.." అంటూ సాయిరెడ్డి పోస్టు చేసారు.












Click it and Unblock the Notifications