Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికలవేళ వైసిపి కొత్త నినాదం..!!

ఏపీలో ఎన్నికల యుద్ధం హోరాహోరీగా మారుతుంది. ప్రధాన పార్టీలు ప్రచార బరిలోకి దిగాయి. అధికారమే లక్ష్యంగా పార్టీ అధినేతలు అడుగులు వేస్తున్నారు. అది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకొనేందుకు సిద్ధంగా లేరు అది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. వైసిపి కొత్త ఎన్నికల నినాదాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

ఎన్నికల ప్రచారం
సీఎం జగన్ ఈనెల 27 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన ని పవన్ కళ్యాణ్ సైతం తమ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభించి తన యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగించేలా షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. ఏప్రిల్ 9న ఉగాది రోజు వైసిపి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించారు. మేనిఫెస్టో అంశాలతో పాటుగా తన ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమం సామాజిక న్యాయం గురించి ఓటర్లకు వివరిస్తూ తాను అధికారంలోకి వస్తే జరిగే మంచిని ప్రస్తావిస్తూ జగన్ ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగనుంది. టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఐదేళ్ల కాలంగా సాగిన పాలన వైఫల్యాలు, తాము అధికారంలోకి వస్తే అమలు చేసే అభివృద్ధి, సంక్షేమం ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్తున్నారు.

YCP Leader Vijayasai Reddy moving with new slogan in Nellore election campaign

ప్రజల్లోకి నేతలు
పవన్ కళ్యాణ్ 27వ తేదీ నుంచి తన వారాహి యాత్ర ద్వారా ఉత్తరాంధ్రలో ప్రచార యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న మూడు పార్టీల లక్ష్యం ఇప్పుడు వైఎస్ఆర్సిపి కానుంది. ఎలాగైనా జగన్ ఓడించి అధికారం దక్కించుకోవాలనేది మూడు పార్టీల లక్ష్యం. ఇందుకోసం వైసిపికి దీటుగా మేనిఫెస్టోతో పాటుగా ఎన్నికల హామీలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతుంది. ఇదే సమయంలో నెల్లూరు జిల్లా కూటమి నేతలకు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారుతుంది. నెల్లూరు ఎంపీగా వైసిపి ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి టిడిపిలోకి వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టిడిపి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నెల్లూరు రూరల్, ఆత్మకూర్ నుంచి పోటీ చేస్తున్నారు. వైసిపి రాజ్యసభ ఎంపీగా పని చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థిగా ఖరారయ్యారు.

ఎన్నికల నినాదాలు
ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా ప్రచారం చేసిన విజయ్ సాయి రెడ్డి టిడిపి నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లాలో కొత్త ఎన్నికల నినాదంతో జనంలోకి వెళ్తున్నారు. టిడిపి జనసేన అభ్యర్థుల్లో ఎక్కువమంది గతంలో వైసిపి లో పనిచేసిన వారేనని వివరిస్తున్నారు. వైసీపీ నేతలకు టికెట్లు ఇస్తూ ఆ రెండు పార్టీలు తమ క్యాడర్ను ఎందుకు ప్రోత్సహించడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమ సొంత క్యాడర్ను నమ్మకుండా వైసిపి నుంచి వచ్చిన వారిని చంద్రబాబు పవన్ నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఎన్నికలు వైసీపీ వర్సెస్ ఫిరాయింపుదారుల మధ్య పోటీగా మారిందని సాయి రెడ్డి కొత్త నినాదం తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో 2019 ఫలితాలను రిపీట్ చేయాలని వైసిపి, ఎలాగైనా తమ పట్టు నిరూపించుకోవాలని టిడిపి ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లాలో ఎన్నికల రాజకీయం, ఫలితాల పైన ఆసక్తి కొనసాగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+