• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

YCP నేత‌ల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్‌?

|
Google Oneindia TeluguNews

విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోజుల వ్య‌వ‌ధిలోనే ఆ అధికారి జులుం విదిల్చారు. క‌మిష‌న‌ర్‌గా త‌న బాధ్య‌త‌లేమిటో అంద‌రికీ గుర్తుచేయ‌డంతో అధికార పార్టీ నేత‌ల‌తోపాటు ఇత‌ర అధికారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఆయ‌న్ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ప్ర‌జాప్ర‌తినిధులు పావులు క‌ద‌ప‌డం ప్రారంభించారు. ఆయ‌నే స్వ‌ప్నిల్ దిన‌క‌ర్‌.

 అన‌ధికార క‌ట్ట‌డాల‌పై క‌మిష‌న‌ర్ క‌న్నెర్ర‌

అన‌ధికార క‌ట్ట‌డాల‌పై క‌మిష‌న‌ర్ క‌న్నెర్ర‌

ఏప్రిల్‌లో బాధ్య‌త‌లు స్వీక‌రించిన స్వ‌ప్నిల్ న‌గ‌రంలో అనుమ‌తి లేని క‌ట్ట‌డాలు, అన‌ధికార నిర్మాణాల‌పై క‌న్నెర్ర చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు సిఫార్సుల‌మీద సిఫార్సులు చేస్తున్న‌ప్ప‌టికీ వాటిని ప‌క్క‌న పెట్టేశారు. మూడు సంవ‌త్స‌రాలుగా విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌నితీరు గాడిత‌ప్పింద‌నే విమ‌ర్శ‌లు రావ‌డంతో స‌మ‌ర్థుడైన అధికారిని చూసి ప్ర‌భుత్వం నియ‌మించింది. స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. గ‌తంలో ఐపీఎస్ అధికారిగా కూడా ప‌నిచేశారు. ముక్కుసూటి మ‌న‌స్త‌త్వం ఉన్న స్వ‌ప్నిల్ నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించేలా చూస్తారు. ఐఐటీ ప‌ట్ట‌భ‌ద్రుడైన ఆయ‌న సివిల్ స‌ర్వీస్‌లోకి రాక‌ముందు కొంత‌కాలం ఒరాకిల్ లో విధులు నిర్వ‌హించారు.

 న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆదాయానికి గండి కొట్టిన ప్ర‌జాప్ర‌తినిధులు

న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆదాయానికి గండి కొట్టిన ప్ర‌జాప్ర‌తినిధులు

ప్ర‌జాప్ర‌తినిధులు, కార్పొరేట‌ర్ల‌తోపాటు ఇత‌ర అధికార పార్టీ నేత‌లంతా ఇష్టానుసారంగా భ‌వ‌న నిర్మాణాల‌ను విజ‌య‌వాడ‌లో చేప‌ట్టారు. దీంతో న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆదాయానికి గండి ప‌డ‌టంతోపాటు అక్ర‌మ క‌ట్ట‌డాలు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరిగాయి. ఆ స‌మ‌యంలో సిటీప్లాన‌ర్‌గా ప‌నిచేసిన వ్య‌క్తి మాజీ మంత్రి అండ‌తో చెల‌రేగిపోయార‌ని, ఆయ‌న‌పై ఫిర్యాదులు చేసిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోలేదంటూ ప్ర‌భుత్వానికి విన‌తులు వెల్లువెత్తాయి. స‌ద‌రు మంత్రి కాస్తా మాజీ అయ్యారు. ఆ సిటీప్లాన‌ర్‌పై విజిలెన్స్ విచార‌ణ జ‌రుగుతోంది. జ‌రిగిన అక్ర‌మాలు నిజ‌మేన‌ని నిర్థార‌ణ కావ‌డంతో కార్పొరేష‌న్‌ను గాడిన పెట్టే బాధ్య‌త స్వ‌ప్నిల్‌కు అప్ప‌గించింది ప్ర‌భుత్వం.

 మార్చేది లేదంటూ స్ప‌ష్టం చేసిన ముఖ్యమంత్రి కార్యాల‌యం

మార్చేది లేదంటూ స్ప‌ష్టం చేసిన ముఖ్యమంత్రి కార్యాల‌యం


విజ‌య‌వాడ తూర్పు, ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల జోక్యానికి ఆయ‌న క‌ళ్లెం వేశారు. వీరంతా కూడ‌బ‌లుక్కొని స్వ‌ప్నిల్‌పై ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి ఫిర్యాదు చేశారు. అయితే క‌మిష‌న‌ర్‌ను మార్చే ఉద్దేశం లేద‌ని, ఆయ‌న్నే కొన‌సాగిస్తామ‌ని సీఎంవో కార్యాల‌యం తేల్చిచెప్ప‌డంతో వారంతా ఖంగుతినాల్సి వ‌చ్చింది. విజ‌య‌వాడ‌లో జ‌రిగే ప్ర‌తి అభివృద్ధి ప‌ని ప్ర‌జాప్ర‌తినిధుల సూచ‌న మేర‌కు కాకుండా ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా జ‌ర‌గాలంటూ త‌న కిందిస్థాయి అధికారుల‌కు క‌మిష‌న‌ర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీచేశారు.

English summary
the Vijayawada Commissioner swapnil harassing the YCP leaders?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X