Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్ పోటీనే కాదు, మా మేడమ్ గ్రేట్, పిఠాపురంలో వాళ్ల పిచ్చి ముదిరింది, అవే లెక్కలు !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిపోవడంతో కౌంటింగ్ కోసం, ఎన్నికల ఫలితాల కోసం తెలుగు ప్రజలు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ?, నాయకుల తలరాతలు ఎలా మారిపోతాయో ? అనే విషయంలో తెలుగు ప్రజలు ఎవరికి తోచినట్లు వాళ్లు ఆలోచించుకుంటున్నారు.

ఎన్నికల పోలింగ్ జరిగిపోయి రెండు వారాలు పూర్తి అయిపోయినా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు మాత్రం నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. అలాంటి నియోజక వర్గాల్లో, ముందు వరుసలో ఉన్న నియోజక వర్గం పిఠాపురం. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. ఇదే పిఠాపురం నుంచి వైసీసీ టిక్కెట్ పై సిట్టింగ్ ఎంపీ వంగా గీతా పోటీ చేశారు.

YCP leaders say that Vanga Geeta will win 100 in Pithapuram and Pawan Kalyan will lose

పిఠాపురంలో కాబోయే ఎమ్మెల్యే ఎవరు ? అని స్థానిక ప్రజలతో పాటు దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలు అందరూ ఎన్నికల ఫలితాల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలింగ్ జరిగిపోయి రెండు వారాలు అయిపోయినా వైసీపీ నాయకులు మాత్రం పిఠాపురంలో మేము అంత చేశాము, ఇంత చేశాము అని చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కు మైనస్ పాయింట్లు, మా నాయకురాలు వంగా గీతాకు ఫ్లస్ పాయింట్లు చాలానే ఉన్నాయంటూ చెప్పుకుంటూనే ఉన్నారు.

ఇంకా ఒక్క అడుగు ముందుకు వేసిన వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ఉప ముఖ్యమంత్రి వంగా గీతా అంటూ కార్ల మీద స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలు అయిన వంగా గీతా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలిగా, మరోసారి ఎంపీగా పని చేశారని, దశాబ్దాల కాలం ఆమెకు ప్రజా సేవ చేసిన అనుభవం ఉందని వైసీపీ నాయకులు గొప్పులు చెప్పుకుంటున్నారు.

ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి చాలా చలనకగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు పవర్ స్టార్ పై సెటైర్లు వేస్తున్నారు. పదో తరగతి చదివిన పవన్ కల్యాణ్ మా నాయకురాలు వంగా గీతాకు పోటీనా అని వ్యంగంగా అంటున్నారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని, ఆయనకు చిన్న జ్వరం వస్తే హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకున్నాడని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

YCP leaders say that Vanga Geeta will win 100 in Pithapuram and Pawan Kalyan will lose

పవన్ కల్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్ వెళ్లిపోయి సినిమాలు తీసుకుంటారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సినిమాలు తీసుకునే పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఉండడని స్థానిక ప్రజలు తెలుసుకున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జ్వరానికి, దగ్గు, జలుబుకు విమానాల్లో వెళ్లి చికిత్స చేయించుకునే పవన్ కల్యాణ్ ను గెలిపిస్తే పిఠాపురంలో ఉండడని, అందుకే మనకు అందుబాటులో ఉండే వంగా గీతాను గెలిపించుకోవాలని ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యి ఓట్లు వేశారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

పిఠాపురంలో వంగా గీతా మరోసారి ఎమ్మెల్యే కావడం గ్యారెంటీ వైసీపీనాయకులు సంకలు గుద్దుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఓడిపోయి హైదరాబాద్ వెళ్లిపోయి సినిమాలు తీసుకుంటూ కాలం గడిపేస్తాడని, మా నాయకులురాలు వంగా గీతా ఉప ముఖ్యమంత్రి అయ్యి ప్రజా సేవ చేస్తారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా జూన్ 4వ తేదీన పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని, ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి వైసీపీ నాయకులకు బుద్ది చెబుతారని జనసేన కార్యకర్తలు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+