ఎన్నికల దెబ్బ, ఆ పార్టీ నాయకుల ఆస్తులు బూడిద, సందట్లో సడేమియా అంటూ పొలాల్లో !
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యి రెండు రోజులు గడిచిపోతున్నా పలు ప్రాంతాల్లో రాజకీయ కక్షల కారణంగా రాజకీయ పార్టీల కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు మద్దతు తెలిపి ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెందిన పోలానికి, వ్యవసాయ పరికరాలకు నిప్పంటించి కాల్చి బూడిద చేశారు.
చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలంలో పలు గ్రామాల్లో పోటాపోటీగా పోలింగ్ జరిగింది. వైసీపీకి అనుకూలంగా కొన్ని గ్రామాలు, టీడీపీకి అనుకూలంగా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఆ ప్రాంతాల్లో రాజకీయ కార్యకలాపాలతో నిత్యం వేడివేడిగా ఉంది. ఇలా ఆ గ్రామాల్లో పోలింగ్ ముందు నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రామకుప్పం మండలంలోని బూరుగపల్లెలో రామేగౌడ అనే రైతుకు చెందిన వ్యవసాయ భూములకు నిప్పు పెట్టడం కలకలం రేపుతోంది. రామేగౌడ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేస్తూ ఆ పార్టీ సానుభూతిపరుడిగా పని చేస్తున్నాడు. ఇదే విషయంలో గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు రామేగౌడ మీద పగతో రగిలిపోతున్నారని తెలుస్తోంది.
చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్న రామేగౌడ గత ఏడాది వైసీపీలో చేరారు. అప్పటి నుంచి వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్న రామేగౌడ ఆ పార్టీ నాయకుల తీరుతో విసిగిపోయి ఇటీవల మళ్లీ టీడీపీలో చేరారు. వైసీపీలో చేరి మళ్లీ టీడీపీలో చేరిన రామేగౌడ ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా పని చేశారని ఆరోపిస్తూ ఆయన మీద వైసీపీ నాయకుల రగిలిపోయారు.
ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరువాత రామేగౌడకు చెందిన అరటి చెట్లకు, టమోట తోటకు, టమోటాలకు కట్టిన కర్రలు, వ్యవసాయ పరికరాలకు నిప్పంటించిన వైసీపీ కార్యకర్తలు అతని మీద పగ తీర్చుకున్నారు. పొలంలో పని చెయ్యడానికి వెళ్లిన రామేగౌడ తోటలకు నిప్పంటించారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ నాయకులు పోలీసు అధికారులకు మనవి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications