Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ చిన్నాన తిరుపతిలో ఇంత పని చేశాడా ?, ఆ భూములపై కన్ను, టీటీడీ చైర్మన్ గా ఉంటూ ?

ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములును కొట్టేశారని వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వైసీపీ నాయకుల భూభాగోతం బయటకు లాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం ద్వారా వాటిని ప్రజల ముందు పెడుతున్నారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి వంతపాడిన అధికారులపై చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారు.

కోట్లాది రూపాయల విలువైన భూములను వైసీపీ నాయకులకు అప్పచెప్పిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్దం అయ్యింది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమల కొండ కింద ఉన్న తిరుపతికి అతి సమీపంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు కోట్టేయడానికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన సొంత చిన్నాన ప్రయత్నించారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

YCP leaders who tried to seize government lands near Tirupati

తిరుపతికి ఆనుకుని తిరుచానూరు పుణ్యక్షేత్రం ఉంది. తిరుచానూరు సమీపంలోని కొట్రమంగళం ప్రాంతంలోని 378/2 సర్వే నెంబర్ లో మొత్తం 6.47 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం భూమి ప్రభుత్వ రికార్డుల ప్రకారం కాలువ పొరంబోకు భూమిగా ఉంది. ఈ పోరంబోకు భూమిలో 4.5 ఎకరాల భూమిని మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

తిరుపతి సమీపంలోని భూమిని వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశారని తెలిసింది. అప్పటి కలెక్టర్ మీద ఒత్తిడి చేసి ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ప్రొసీడింగ్స్ తీసుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఆయన పేరు నమోదు చేసుకోవాలని ప్రయత్నించడంతో కూటమి నాయకులు అనుకున్నారు. తరువాత కూటమి ప్రభుత్వం సుమారు రూ. 70 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేయకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకట్టవేసింది.

ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసిన సందర్బంలో కూడా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆ భూమిని కొట్టేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇదే వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి సమీపంలోని తిరుచానూరు సమీపంలోని సర్వే నెంబర్ 234లోని చెరువును మూడు డివిజన్లుగా విభజించారు.. కొంత భాగాన్ని అప్పట్లో శిల్పారామానికి ఇవ్వాలని గతంలో అధికారంలో ఉన్నచం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయిచింది. అయితే తరువాత చంద్రబాబు ప్రభుత్వం మారిపోవడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

YCP leaders who tried to seize government lands near Tirupati

తరువాత తిరుచానూరు సమీపంలోని ఆ చెరువు భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. తరువాత ఆ భూమి మాదే అంటూ వైసీపీ నాయకులు వాదిస్తున్నారని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళం పరిధిలో చాలా మందికి డీకేటీ పట్టాలు మంజూరు చేశారు. కుంట, కాలువ భూములు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో ఉన్న డీకేటీ భూములు విక్రయించుకోవడానికి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అదే సమయంలో ప్రభుత్వం జీవో నెంబర్ 596 తీసుకురావడంతొ కొందరు వైసీపీ నాయకులు డీకేటీ భూములు ఉన్న వారిని బెదిరించి వారి పేరు మీద రాయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా 25 ఎకరాల భూములను వైసీపీ నాయకులు కొట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. దుర్గసముద్రంలోని 7.98 ఎకరాల అనాధీనం భూములను నిషేదిత జాబితా నుంచి తొలగించడానికి వైసీపీ ప్రభుత్వంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. ఆ భూముల విలువ సుమారు రూ. 270 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఇది ప్రభుత్వ విలువ మాత్రమే అని, బహిరంగ మార్కెట్ లో దాని విలువ ఇంకా ఎక్కువగా ఉంటుందని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న తిరుపతి కూటమి నాయకులు ఆ భూములు కబ్జా కాకుండా అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపిస్తే వైసీపీ నాయుకులు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎన్ని భూదందాలు చేశారు అని వెలుగు చూస్తుందని కూటమి నాయకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+