పార్టీ వీడటంపై కీలక కామెంట్స్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘెరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్ద సంకటంగా మారింది.

ఎన్నికల్లో ఓడిపోవడంతో చాలామంది నేతలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అరకు ఎంపీ చెట్టి తనూజారాణి బీజేపీతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీ గుర్తు మీద గెలిచిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

YCP MLA denied the news of changing the party

వైసీపీ నుంచి గెలిచిన 11 ఎమ్మెల్యేల్లో విశ్వేశ్వర రాజు కూడా ఒకరు. ఆయన పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆయన టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా విశ్వేశ్వర రాజు స్పందించారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగన్‌తో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. నాకు జగన్ చాలాసార్లు అండగా నిలిచారని..తన రాజకీయ ఎదుగదలకు ఆయనే కారణమని..అలాంటి వ్యక్తిని మోసం చేసి వెళ్తే పుట్టగతులుండవని విశ్వేశ్వర రాజు చెప్పుకొచ్చారు. వైసీపీని వీడి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ ఐదేళ్లు ప్రజల మధ్యన ఉండి తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+