కూల్చడానికి ఇదేమైనా సినిమా సెట్టింగా?: పవన్ కల్యాణ్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైసీపీ

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోనని, సీఎం జగన్ సర్వనాశనమైపోతాడని తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు అధికార వైసీపీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీలో ప్రభుత్వ పథకాలపై చర్చ సందర్భంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్.. పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. సభా వేదిక నుంచే జనసేనానికి హెచ్చరికలు జారీచేశారు.

సినిమా సెట్టింగ్గా?

సినిమా సెట్టింగ్గా?


‘‘వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఒక మహానాయకుడు టీవీల్లో మాట్లాడాడు. ఢిల్లీకి వెళ్లిమరీ జగన్ ప్రభుత్వాన్ని కూలగొడతానని అంటున్నాడు. కూల్చేయడానికి, కూల్చేస్తే కూలిపోడానికి ఇదేమైనా సినిమా సెట్టింగా? నువ్వు సినిమాల్లో విలన్లను కొడుతుంటే సెట్టింగ్ లు కూలిపోతుంటాయికదా.. ప్రభుత్వ వ్యవస్థ కూడా అలాంటిదేనని అనుకుంటున్నావా?''అని జోగి రమేశ్ ఎద్దేవా చేశారు.

ఢిల్లీనే ఢీకొట్టిన దీశాలి జగన్

ఢిల్లీనే ఢీకొట్టిన దీశాలి జగన్

ఢిల్లీ వెళ్లిమరీ జగన్ సర్కారును ఢీకొడుతానని పవన్ మాట్లాడటం హాస్యాస్పదమని, ఢిల్లీని ఏలిన పార్టీలే.. వైఎస్ జగన్ జైలులో నిర్భందిస్తామని కాలగర్భంలో కలిసిపోయాయని, ఢిల్లీ కోటలనే ఢీకొట్టిన ధీశాలి జగన్ అని జోగి రమేశ్ అన్నారు. ఇక్కడ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక.. సీఎం జగన్ చేసిన పనుల్ని మెచ్చుకుంటుంటే.. ఆ పార్టీ అధినేత పవన్ ఢిల్లీకి పోయి చేసేది ఏముంటుందని చుకర అంటించారు.

ఇంచు కూడా పెకిలించలేరు..

ఇంచు కూడా పెకిలించలేరు..

కూల్చేస్తేనో, కాల్చేస్తేనో పడిపోవడానికి వైసీపీది అల్లాటప్పా ప్రభుత్వం కాదని, ఏపీలోని కోట్లాది కుటుంబాల ఆశీర్వాదాలతో, నిజమైన జన బలంతో జగన్ నిర్మించిన కోట వైసీపీ ప్రభుత్వమని, ఎవడైనాసరే దీన్ని ఒక ఇంచుకూడా పెకిలించలేరని ఎమ్మెల్యే రమేశ్ హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం అమరావతి రైతులతో ముఖాముఖి సందర్భంలో జన సేన చీఫ్ పవన్ కల్యాణ్.. వైపీసీ ప్రభుత్వం, సీఎం జగన్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+