నారా లోకేశ్, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ప్రమాణాల రాజకీయం..!!
లోకేష్ పాదయాత్ర వందో రోజుకు చేరింది. ఇదే సమయంలో వైసీపీ నేతలతో సవాళ్లు తారా స్థాయికి చేరాయి. లోకేశ్, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి మధ్య ప్రమాణాల రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దమ్ముంటే మహానందికి రా... అంటూ లోకేష్ టార్గెట్‌గా శిల్పా చక్రపాణి సవాల్ చేసారు. శిల్పాను ఉద్దేశించి నారా లోకేష్ చేసిన ఆరోపణలు..దానికి కౌంటర్లు ఇప్పుడు రెండు పార్టల మధ్య కర్నూలు జిల్లాలో రాజకీయ యుద్దంగా మారింది.
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పైన నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. భూకబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి దందాలు, కమీషన్లు.. చివరికి దేవుడిని కూడా వదల్లేదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, బంధువులు, అనుచరులు కలిసి శ్రీశైలంను దోచుకుంటున్నారుని ఆరోపించారు. ఈ ఆరోపణల పైన ఎమ్మెల్యే శిల్పా స్పందించారు. తనకు చీటింగ్ చక్రపాణి పేరు పెట్టానన్నావ్ చాలా సంతోషమని వ్యాఖ్యానించారు. మీ చీటింగ్ స్కూల్లో 6 ఏళ్ల పాటు చదువుకున్నానంటూ లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు. తాను చీటింగ్ మనిషి అయితే ఒకసారి జిల్లా అధ్యక్ష పదవి, రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

మీ తండ్రిని అడిగితే తన గురించి చెబుతారని లోకేష్ ను ఉద్దేశించి చక్రపాణి వ్యాఖ్యానించారు. తన సొంత నిధులతో ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు.శ్రీశైలం కు తమ బంధువులు వచ్చినా టికెట్లు కొని పంపిస్తానని చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు దర్శనం కోసం తనకు కాల్ చేస్తే తానే టికెట్లు కొని పంపించానని వివరించారు. దౌర్జన్యంగా దర్శనాలు ఇప్పించుకొనే బుడ్డా టీడీపీలోనే ఉన్నాడని శిల్పా పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. 2019లో ఇచ్చిన హామీలు చాలా వరు అమలు చేసామని చెప్పుకొచ్చారు. తన పైన చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ చేసారు.












Click it and Unblock the Notifications