కలలో కూడా అనుకోలేదు అడ్డంగా బుక్కైపోతాడని, వైసీపీ ఎమ్మెల్సీ వీడియో నిజమేనా ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారవుతుందని ఆ పార్టీలోని కొందరు నాయకులు గుసగుసలాడుతున్నారు. గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరో వివాదంలో చిక్కుకున్నాడు. అయితే ఈసారి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అడ్డంగా బుక్ అయిపోయాడని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్ లో మాట్లాడిన ఓ వీడియో లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన ఓ మహిళా నాయకురాలితో అనంతబాబు అసభ్యంగా ప్రవర్థిస్తూ, వెకిలి చేష్టలు చేస్తూ వీడియో కాల్ లో మాట్లాడాడని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అది మార్కింగ్ వీడియోలని, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మీడియాకు చెప్పారు.

YCP MLC Anantha Babu is in trouble after filing a police case

మార్ఫింగ్ చేసిన వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఫిర్యాదు చేశారు. అనంతబాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. మిమ్మల్ని ఎవరెవరు బ్లాక్ మెయిల్ చేశారని, మీరు ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారని పూర్తి సమాచారం, బ్యాంక్ వివరాలు ఇవ్వాలని పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సూచించారు.

ఇదే ఏడాది మే నెల మంచి జూన్ 24వ తేదీ వరకు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులకు బ్యాంక్ అకౌంట్, గూగుల్ పే ద్వారా తాను సుమారు రూ 13 లక్షలు డబ్బులు వారి అకౌంట్ లో వేశానని అనంతబాబు పోలీసులకు బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కే సంతోష్ కుమార్, బైరు వాసుగౌడ్ తో పాటు మరో ఇద్దరు మహిళలకు తను డబ్బు చెల్లించానని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులు బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చారు.

YCP MLC Anantha Babu is in trouble after filing a police case

అయితే మార్కింగ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తే మీరు ఎందుకు భయపడి వాళ్ళకి డబ్బులు చెల్లించారని పోలీసులు ప్రశ్నించడంతో అనంతబాబు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారని తెలిసింది. అవి నిజమైన వీడియోలు కాబట్టే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆ మహిళలకు డబ్బు చెల్లించాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఉన్న ఇద్దరు మహిళల వివరాలు అనంత బాబు పోలీసులకు చెప్పాడని, వారే బ్లాక్ మెయిల్ చేశారని అనంతబాబు పోలీసులకు చెప్పారని తెలిసింది.

అనంతబాబు ఈ వ్యవహారం వైసీపీని మరింత ఇబ్బంది పెడుతోందని ఆ పార్టీలోని ఒక నాయకుడు అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం పదేపదే పార్టీని ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇప్పటికైనా ఆయన మీద వైసీపీ అధినేత చర్యలు తీసుకోవాలని అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు అంటున్నారు. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనను బ్లాక్ మెయిల్ చేసిన మహిళలకు డబ్బులు చెల్లించాడని పోలీసులకే చెప్పడంతో ఇప్పుడు ఆ ఆయన అడ్డంగా బుకైపోయారని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+