టీడీపీ ఆవిర్భావం నాడు ..తుప్పుకు అంతర్ధాన దినోత్సవ శుభాకాంక్షలు : వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ధ్వజం
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీని, ఇటు బీజేపీ ని టార్గెట్ చేస్తూ విజయ్ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా మరోమారు చెలరేగిపోయారు.
ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలు శ్రేణులు టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంటే టిడిపి అంతర్ధాన దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

ఎందరో మహనీయుల స్పూర్తితో టీడీపీ ఆవిర్భావం అన్న చంద్రబాబు .. నేడు 40 వ ఆవిర్భావ వేడులకు
తెలుగుదేశం పార్టీ నలభై ఆవిర్భావ దినోత్సవాన్ని టిడిపి నేతలు ఘనంగా జరుపుకుంటున్న వేళ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ,పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు . గురజాడ, పొట్టిశ్రీరాములు, కందుకూరి వీరేశలింగం, అంబేద్కర్ వంటి మహనీయుడు స్ఫూర్తితో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలుగువారంతా ఆత్మగౌరవంతో జీవించాలని , తెలుగు నేల ఘనతను ప్రపంచం నలుదిశలా చాటాలని తపించారని ఎన్టీఆర్ ను ఉద్దేశించి చంద్రబాబు పేర్కొన్నారు .

వ్యవస్తాపకుడిని 13 ఏళ్ల లోనే పాతేసి, 26 ఏళ్ల తర్వాత పార్టీనే పాతేసిన తుప్పు అంటూ విరుచుకుపడిన సాయిరెడ్డి
ఇక ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని, తెలుగుదేశం పార్టీ అంతర్థాన దినోత్సవం అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ వ్యవస్థాపకుడిని 13 ఏళ్ల లోనే పాతేసి, 26 ఏళ్ల తర్వాత పార్టీనే పాతేసి, ఓడిన కొడుకుతో పరాయి రాష్ట్రంలో ఏకాంతవాసం చేస్తున్న తప్పుకు పార్టీ అంతర్ధాన దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ పెట్టారు ఎంపీ విజయసాయిరెడ్డి.

బీజేపీపైన విజయసాయి ఫైర్ .. డిపాజిట్లు వస్తే సీఎం అయిపోతాడా అంటూ ఎద్దేవా
అంతేకాదు తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో అటు బిజెపి పైన కూడా చెలరేగిపోయారు.
తిరుపతి ఉప ఎన్నికల ముందు బిజెపి నాయకులు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడు అన్నట్లుగా నటిస్తున్నారు . ఎవరి పాత్రలు వారు జీవించండి. చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. కానీ జనం మాత్రం మళ్లీ వైసీపీని దీవిస్తారు అంటూ బీజేపీ నేతలను సైతం టార్గెట్ చేసి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications