413 కోట్లు ఇస్తున్నట్టు జీవో.. ఇవీ చంద్రబాబు కుతంత్రాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపైన వైసీపీ నేతలు పదేపదే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసిపి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
చంద్రబాబుపై సాయిరెడ్డి ఫైర్
చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నది ఏమి లేదని సోషల్ మీడియా వేదికగా నిత్యం విరుచుకుపడుతున్న వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో ఉచిత ఇసుక పైన నిన్నటికి నిన్న టార్గెట్ చేశారు. ఉచిత ఇసుక పాలసీ తెచ్చామని చెప్పిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కొరతను నివారించలేక పోతున్నారని, భవన నిర్మాణ రంగ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు.

జీతాలు లేవు, నిధులు లేవు
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టన్ను ఇసుక 475 రూపాయలు ఉండేదని, దానికి బదులుగా టన్ను ధర మూడు వేల రూపాయలకు పెరిగిందని చంద్రబాబు పాలనను టార్గెట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం సర్వ శిక్ష అభియాన్ కోసం 413 కోట్లు విడుదల చేస్తున్నట్టు గొప్పగా చెప్పుకుంటూ గత నెలలో జీవో జారీ చేసిందని, కానీ జీతాలు లేవని, నిధులు లేవని టార్గెట్ చేశారు.
పూర్తి అసమర్థతకు నిదర్శనం
108, 104 సిబ్బంది కూడా గత రెండు నెలలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్నారని, RWS ల్యాబ్ ఉద్యోగులకు జీతాలు రాలేదని ఉద్యోగుల కుటుంబాలు అద్దె చెల్లించలేక కనీస అవసరాలు తీర్చుకోలేక మనగుడ కోసం కష్టపడుతున్నారని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఇది చంద్రబాబు క్రూరమైన నిర్లక్ష్యానికి ,పూర్తి అసమర్థతకు, సంపూర్ణ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
రూ. 400 కోట్లు ఇస్తున్నట్టు జీఓ విడుదల అయింది. కుల మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాల్లో రాసింది. టీవీల్లో రోజంతా బ్రేకింగు న్యూస్ నడిచాయి. నిధులు మాత్రం హుళక్కి. చంద్రబాబు కుతంత్రాలు అలాగే ఉంటాయి. సమగ్ర శిక్ష లో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు.… pic.twitter.com/5Z4968oj0B
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2024
జీతాలపై మళ్ళీ మండిపడిన సాయిరెడ్డి
తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. ఇక తాజాగా నేడు మరోమారు జీతాలు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వం పైన విజయ సాయి రెడ్డి భగ్గుమన్నారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు సర్కార్ పనితీరు పైన స్పందించిన విజయసాయిరెడ్డి 400 కోట్లు ఇస్తున్నట్టు జీవో విడుదల చేసి కులం మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాలతో రాయించుకొని రోజంతా బ్రేకింగ్ న్యూస్ లు పెట్టి హంగామా చేశారన్నారు.
నిధులు హుళక్కు
నిధులు మాత్రం హుళక్కు అయ్యాయని, చంద్రబాబు కుతంత్రాలు ఇలానే ఉంటాయ్ అంటూ టార్గెట్ చేశారు. సర్వ శిక్ష అభియాన్ లో 25వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారని .. సారూ జీతాలు ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారని విజయ సాయి రెడ్డి ఈ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు. ఇదీ చంద్రబాబు పాలన అంటూ సాయి రెడ్డి పోస్ట్ పెట్టి చంద్రబాబును టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications