ఎర్రచందనం స్మిగ్లింగ్: కోర్టుకు జగన్ పార్టీ ఎంపిపి

గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం
గుంటూరు జిల్లాలోని లింగాయపల్లిలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు.
అగ్నిప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం కొత్తఫ్లైవోర్ బ్రిడ్జి దగ్గర ప్లాస్టిక్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపుచేశారు. ప్లాస్టిక్‌గోడైన్ సమీపంలోనే గ్యాస్‌గోడౌన్‌లు, యూరియా గోడౌన్‌లు, పెట్రోల్ బంకులు ఉండటంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు.
కిడ్నాప్ యత్నం విఫలం
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి వెస్ట్ సాయినగర్‌లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ యత్నం విఫలమైంది. గత రాత్రి సూర్యతేజ అనే బాలుడిని వెంకటరమణ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. పాతకక్షలే కిడ్నాప్‌కు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications