డ్యూటీ ఎక్కిన యాంకర్ శ్యామల..పిల్లికి బిచ్చం వేయలేదంటూ హాట్ కామెంట్స్( వీడియో)

ఎవరూ ఊహించని విధంగా యాంకర్ శ్యామలకు పార్టీలో ఉన్నత పదవిని అప్పగిస్తూ పార్టీ అధినేత జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించింది. మాజీ మంత్రి ఆర్ కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేసింది. ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ శ్యామలకు కూడా చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.పార్టీపరంగా పని చేస్తున్నప్పటికి ఎలాంటి హోదా లేకుండానే ఆమె గత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డారు. దీన్ని గుర్తించిన జగన్ శ్యామలను పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ లిస్ట్‌లో యాంకర్ శ్యామల పేరు ఉండటం అందర్ని ఆశ్చర్యపరిచింది.

పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించినందుకు శ్యామల పార్టీ అధినేత వైఎస్. జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టిన శ్యామల కూటమి ప్రభుత్వంపై తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఆ నిందను వైఎస్ జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్యామల తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతమందికి సహాయపడ్డారో వివరించాలని ఆమె డిమాండ్ చేశారు.గత జగన్ ప్రభుత్వంలో వరద బాధితులను ఏవిధంగా సాయం చేశామో కళ్లు తెరిచి చూడాలని కూటమి నేతలకు ఆమె హితవు పలికారు.

YCP official spokesperson Shyamala criticized Chandrababu

ఓడిపోయిన తర్వాత కూడా జగన్ ప్రజలకు అందించిన సాయం గురించి ఆమె ప్రజలకు వివరించారు. జగన్ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, మీ రాజకీయ జీవితంలో ఆ విధంగా చేసిన సాయాలు ఎన్ని ఉన్నాయో తెలిపాలని చంద్రబాబును శ్యామల డిమాండ్ చేశారు. అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని ఏది పడితే అది ఇలా ప్రచారం చేయడం సబబు కాదని చంద్రబాబుకు శ్యామల హితవు పలికారు. ఇక శ్యామల విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో ఆమె అధికార వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆ పార్టీ అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కల్యాణ్ జనసేన , టీడీపీకి అండగా నిలిచిన తరుణంలో శ్యామల ఒక్కరే వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు.

వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆమె టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉంటే ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు లేకుండా చేస్తారనే టాక్ ఉంది. అలీ, పోసాని వంటి గొప్ప పేరున్న నటులకు సైతం ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయినప్పటికి కూడా యాంకర్ శ్యామల వైసీపీకి అండగా నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+