రాజకీయాలకు రఘురామ కృష్ణంరాజు గుడ్ బై..?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ తనకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదని తెలిపారు. నాకు రాజకీయ పార్టీల అండ లేదని..అది ఈపాటికే మీకు అర్థం అయి ఉంటుందని రఘురామ చెప్పుకొచ్చారు. నేను ఏ పార్టీలో సభ్యుడును కాను కాబట్టి నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబులాంటి గొప్ప వ్యక్తి సీఎం కావాలని నేను పోరాటాలు చేశానని.. అంతే కానీ పదవులు కోసం తాను ఏనాడు ఆరాటపడింది లేదని రఘురామ చెప్పారు. ఇటీవల టీడీపీ. బీజేపీల్లో చేరిన నాయకులు ఎవరూ కూడా ఏనాడు కనిపించింది లేదని..జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం చూడలేదని.. వారు ఎక్కడైనా జగన్ గురించి మాట్లాడింది చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.

ycp rebal Raghurama Krishnam Raju good bye to politics

ఇంతమందికి టికెట్లు కేటాయించిన ఈ కూటమి( టీడీపీ, జనసేన, బీజేపీ) తనకు సీటు కేటాయించకపోవడంపై రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌పై నేను చేసిన పోరాటాలే నాకు శాపంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎటువంటి లాపేక్ష లేకుండా చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నానని.. కానీ నాకే ఎటువంటి న్యాయం జరగలేదంటూ రఘురామ వాపోయారు. చంద్రబాబును జగన్ ముసలోడు అంటూ సంబోంధిండాన్ని ఆయన తప్పుపట్టారు.

ఇదిలా ఉంటే రఘురామ కృష్ణంరాజు రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నట్టు సమాచారం అందుతోంది. టీడీపీ అనుకూల మీడియాలో సైతం రఘురామ కృష్ణంరాజు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు వెలిశాయి. ఏ పార్టీ కూడా తనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. టీడీపీ- జనసేన -బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం బరిలో దిగాలని భావించిన రఘురామ రాజుకు నిరాశే ఎదురైంది.

పొత్తులో భాగంగా నరసాపురం సీటు బీజేపీకి దక్కడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించిన రఘురామకు గట్టి షాక్ తగిలింది. నరసాపురం అభ్యర్థిగా మరో వ్యక్తిని ఎంపిక చేయడంతో రఘురామకు మొండిచేయి ఎదురైంది.దీంతో టీడీపీలో చేరి ఎమ్మెల్యే సీటు సాధిద్దామని ఆయన చేసిన ప్రయత్నాలు ఏమీ కూడా ఫలించలేదని తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు రఘురామకు టికెట్ నిరాకరించడంతో..ఆయన రాజకీయల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+