అలర్ట్: టికెట్ లేకుండా కూడా రైలులో ప్రయాణం చేయొచ్చు

భారతదేశంలో ప్రతిరోజూ 2.5 కోట్ల మంది రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. దీనికోసం ప్రతిరోజు ఏడున్నరవేల నుంచి ఎనిమిదిన్నరవేల మధ్యలో రైళ్లు నడుస్తున్నాయి. టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. వాస్తవానికి రైలు బయలుదేరే సమయానికి కౌంటర్ వద్ద క్యూ ఎంతో పొడవుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఎక్కువమంది టికెట్ కొనుగోలు చేయలేక, టికెట్ లేకుండా రైలు ఎక్కలేక ఇబ్బందికి గురవుతుంటారు.

టికెట్ కొని ప్రయాణించడం అనేది చట్టబద్దం. అది లేకుండా రైలు ఎక్కి ఎన్నోసార్లు పట్టుబడిన సందర్భాలు అనేకం ఉంటాయి. నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ట్విట్టర్ హ్యాండిల్‌లో భారతీయ రైల్వేకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నిబంధనలను షేర్ చేసింది. దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. కొన్ని పరిస్థితుల్లో టికెట్ కొనలేరు. అయితే అటువంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

You can travel by train even without a ticket know the rule

కొత్త నిబంధనల ప్రకారం రైలు లోపల టిక్కెట్లు ఇచ్చే సౌకర్యాన్ని కూడా రైల్వే ప్రారంభించింది. టిక్కెట్లు లేని ప్రయాణికులు టీటీఈని సంప్రదించి టిక్కెట్లు పొందవచ్చు. TTEని స్వయంగా సంప్రదించి మీ పరిస్థితి గురించి వారికి తెలియజేయాలి. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం TTE నుండి మాత్రమే టిక్కెట్‌ను పొందాలి. రైల్లో టీటీ వద్ద ఓ మెషిన్ ఉంటుంది. దీని సహాయంతో రైలులోనే ఆయన టిక్కెట్లు ఇస్తారు. మీ వద్ద రిజర్వేషన్ టిక్కెట్ లేకపోతే రూ. 250 జరిమానా ఉంటుంది. మీరు రైలు ఎక్కిన ప్రదేశం నుండి గమ్యస్థానానికి వెళ్లే ఛార్జీని చెల్లించాలి.

ఈ హ్యాండ్ హోల్డ్ మెషిన్ రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సర్వర్‌కు కనెక్ట్ అయివుంటుంది. ప్రయాణికుడు టికెట్ అడిగిన వెంటనే మెషిన్‌లో పేరు, స్థలం నమోదు చేయగానే టికెట్ బయటకు వస్తుంది. మెషిన్ సాయంతో అదే రైలులో ఖాళీగా ఉన్న బెర్త్‌ల సమాచారాన్ని కూడా సులభంగా పొందవచ్చు. వెయిటింగ్ లిస్ట్ క్లియర్ కాకపోతే TTE వద్దకు వెళ్లి తన టిక్కెట్‌ను చూపించి, ఖాళీగా ఉన్న సీటుకు సంబంధించిన సమాచారాన్ని పొందాని దాన్ని ఉపయోగించుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+