ఆన్‌లైన్ ప్రియుడి కోసం అమెరికా నుంచి ఏపీకి వచ్చిన యువతి.. చివరకు ఏం జరిగిందంటే..?
ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువే జరుగుతున్నాయి. ప్రేమ కోసం దేశాలు దాటి మరీ వెళ్ళి పెళ్లి చేసుకుంటున్న ఘటనలను గమనించవచ్చు. పబ్జీ గేమ్‌లో మొదలైన పరిచయంతో.. మన దేశ యువకుడిని ప్రేమించి పాకిస్థాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు దేశమే కాదు ఏకంగా ఖండాలు దాటుకొని మరి ప్రేమించిన యువకుడి కోసం ఇండియాకి వచ్చేసింది ఓ యువతి.
ఆన్‌లైన్ లవ్ స్టోరీ..
చందన్.. ఏపీలోని ఒక పల్లెటూరుకు చెందిన యువకుడు. ప్రస్తుతం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చందన్ ఫ్రొఫెల్ చూసి అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరో అనే యువతి ప్రేమలో పడింది. ముందుగా ఆమె అతనికి హాయ్ అని మెసేజ్ చేసింది. అలా మొదలైన సంభాషణ.. 8 నెలల ఆన్‌లైన్ డేటింగ్ తర్వాత.. ఒక కొత్త అధ్యాయానికి తెర లేపింది. చివరికి ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాడమైన ప్రేమను అనుభూతి చెందారు.

దాంతో చందన్‌తో పెళ్లికి తన తల్లి అంగీకారం తీసుకుంది. జీవిత భాగస్వామి కోసం తన తల్లితో కలిసి భారత్‌కు వచ్చేసింది ఫోరెరో. వీరిద్దరి లవ్ జర్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చందన్ వీసా కోసం ప్రయత్నిస్తున్నామని.. త్వరలోనే అమెరికాలో ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని ఫోరెరో చెబుతుంది.
వీరిద్దరి లవ్ విషయం తెలిసిన వారంతా సోషల్ మీడియా వేదికగా అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమ ఎవర్ని అయినా ఎంతవరకు అయినా తీసుకు వెళ్తుంది అనడానికి ఈ ఘటన మరో ఉదాహరణ అని చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications