హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నారై అమ్మాయిలకు ఎర, ఫోటోలు తీసి.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విదేశాల్లో స్థిరపడిన అమ్మాయిలో లక్ష్యంగా తప్పుడు సమాచారంతో ఓ ప్రముఖ మ్యాట్రీమోనీ వెబ్‌సైట్లో ప్రొఫైల్ ఉంచి.. తనను సంప్రదించిన వారితో పరిచయాలు పెంచుకొని, చాటింగులు చేస్తూ. ప్రత్యక్షంగా కలిసినప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి బహిరంగ పరుస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి శనివారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

నకిలీ ప్రొఫైల్ అకౌంట్లతో యువతులను వేధించడంతోపాటు ఓ యువతి చావుకు అతను కారణమైనట్లుగా ఆరోపణలు ఉన్నాయి. బాధిత యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు చెన్నైలో నిందితుడు పర్వేజ్ (37)ను అరెస్ట్ చేశారు.

అరెస్ట్

అరెస్ట్

సిసిఎస్ డిడి డిసిపి పాలరాజు కథనం ప్రకారం చెన్నైకి చెందిన పర్వేజ్ అలీ అలియాస్ సల్మాన్ బిల్డింగ్ కాంట్రాక్టర్. అతడికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పర్వేజ్ ఓ మ్యాట్రీమోనీలో నకిలీ ప్రొఫైల్ అకౌంట్స్ ద్వారా అమెరికాలో స్థిరపడిన హైదరాబాద్ యువతులతో పరిచయాలు పెంచుకునేవాడు.

అరెస్ట్

అరెస్ట్

పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి వెబ్ చాటింగ్ ద్వారా రహస్యంగా యువతుల ఫోటోలు తీసి.. మార్ఫింగ్ చేసేవాడు. అలా తీసిన ఫొటోల ద్వారా యువతులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు, కానుకలను డిమాండ్ చేసేవాడు.

అరెస్ట్

అరెస్ట్

అమెరికాలో చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఫొటోలను సేకరించి బెదిరించసాగాడు. నిందితుడి బెదిరింపులు తాళలేక సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు పర్వేజ్ వ్యవహారాన్ని ఆ యువతి తన తల్లిదండ్రులకు మెయిల్ ద్వారా తెలియజేసింది.

అరెస్ట్

అరెస్ట్

ఈ మేరకు బాధిత యువతి తండ్రి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రాథమిక వివరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు పర్వేజ్‌ను చెన్నైలో అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా నిందితుడు మొత్తం ఆరుగురు యువతులను మోసం చేశాడని, మరో యువతికి వల విసిరాడని తెలిపారు. నిందితుడు నకిలీ దస్తావేజుల ద్వారా పలు బ్యాంక్‌లను మోసం చేసినట్టు తెలిసింది.

English summary
Youth arrested for fake profile in matrimony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X