వేధింపు కేసు పెట్టిందని యువతిపై దాడి, టీడీపీ ఎంపీటీసీ హత్య

హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని హయత్ నగర్‌లో పోకిరీలు రెచ్చిపోయారు. వేధించారని కేసు పెట్టిన ఓ యువతి ఇంటి పైన ముగ్గురు యువకులు గురువారం ఉదయం దాడికి పాల్పడ్డారు. ఎందుకు వేధిస్తున్నారని అడిగినందుకు యువతి సోదరుడి పైన కూడా దాడికి పాల్పడ్డారు. యువకుల రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

వివాహితపై అత్యాచారం

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఎం లింగాపురంలో దారుణం జరిగింది. అక్క ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా వివాహిత పైన దుండగులు సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తిరుపతిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Youth attack on girls residence

తిరుపతి నగరంలోని రేణిగుంట గాజులమండ్యం పారిశ్రామిక వాడలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పోలీసులు నగరంలో విసృత తఆలు నిర్వహించారు.
తనిఖీల్లో అనుమానం వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకొని పరిశీలించగా వారివద్ద నాలుగు కేజీల మాదకద్రవ్యాలు లభించాయి. వారి నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

టెక్కలిలో టీడీపీ ఎంపీటీసీ దారుణ హత్య

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టీడీపీ ఎంపీడీసీ సభ్యుడు కోళ్ల అప్పలనాయుడు దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఆయన పాత జాతీయ రహదారి పైన నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు ముసుగు ధరించి వచ్చి కత్తులతో నరికారు.

మండపాలెం కాలనీలో భూసమస్య పరిష్కరించాలని ఎవరో ఫోన్ చేయడంతో అతను అక్కడికి ఒంటరిగా బయలుదేరారు. ఆ సమయంలో దుండగులు హత్యకు పాల్పడ్డారు. హత్య అనంతరం వారు ఆటో, బైకుల పైన పరారయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+