షాక్: రెజీనాను చూడ్డానికి వచ్చి యువకుడు కాలిపోయాడు

హీరోయిన్ రెజీనాను చూడడానికి వచ్చిన ఓ యువకుడు గుంటూరు నగరంలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

గుంటూరు: సినీ హీరోయిన్ రెజీనాను చూడటానికి వచ్చిన ఓ యువకుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి. అందరూ చూస్తుండగానే అతను సజీవదహనమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో రెజీనా ప్రారంభించబోతున్న నీరూస్ షోరూం వద్దకు పెద్ద యెత్తున అభిమానులు చేరుకున్నారు.

షోరూంకు ఆనుకుని ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దాని పక్కనే ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడానికి విజయ్ పూనుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఫ్లెక్సీ రాడ్ కరెంట్ తీగలకు తాకి షాక్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో మహేష్ అనే యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

Fire

అంతలోనే ట్రాన్స్ ఫార్మర్ కారణంగా ఫ్లెక్సీకి మంటలు వ్యాపించి ఆ యువకుడు సజీవ దహనం అయ్యాడు. అతడిని మంటల నుంచి బయటకు లాగేందుకు కర్రల సాయంతో ప్రయత్నించారు. అయితే అతను అప్పటికే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు.

అయితే ఈ ప్రమాద ఘటనలో మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. మృతుడు మహేష్ గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందినవాడని చెబుతున్నారు. అతను రెజినాను చూడడానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+