జగన్‌పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరక పోస్ట్: 'పబ్లిక్‌గా పెడితే నీకు వచ్చిందా అంటూ'

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ వ్యక్తి సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో అభ్యంతరక పోస్టు పెట్టారు. అతనిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.

చదవండి: జగన్ గురించి ఆరా: మోడీతో విజయసాయి భేటీ, చక్రం తిప్పుతున్నారా, బాబుకు షాకేనా?

జగన్‌పై కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన పరుచూరి సురేష్ కుమార్ ఫేస్‌బుక్‌లో అసభ్యకరంగా పోస్టు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న పామర్రు వైసీపీ ఇంచార్జ్ అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదవండి: జగన్‌కు షాక్: రాజీనామాకు అందరూ ఒకే కారణం చూపారు! రంగంలోకి నేతలు

పోలీసుల దర్యాఫ్తు

పోలీసుల దర్యాఫ్తు

అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతని ఫేస్‌బుక్ అకౌంట్ ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నారు. త్వరలోనే సురేష్‌ను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. జగన్‌పై పెట్టిన పోస్టు ఏమిటనేది తెలియాల్సి ఉంది. వైసీపీ ఫిర్యాదుతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.

  YS Jagan padayatra : బీసీలకు అండగా ఉంటా, బాబు లా మోసం చెయ్యను !
  అనుచిత వ్యాఖ్యల గురించి తెలిసి

  అనుచిత వ్యాఖ్యల గురించి తెలిసి

  ఇదిలా ఉండగా, పోలీసులు తొలుత ఫిర్యాదును స్వీకరించేందుక నిరాకరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌పై అనుచిత వ్యాఖ్యల గురించి తెలిసి అనిల్ కుమార్, మరికొందరు వైసీపీ నాయకులు శనివారం సాయంత్రం కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

  అమర్యాదగా ప్రవర్తించారని

  అమర్యాదగా ప్రవర్తించారని

  పార్టీ లెటర్ హెడ్‌పై ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని, అడ్రస్ చెప్పాలని అడిగారని, పబ్లిక్‌గా పెట్టిన పోస్టు నీకు వచ్చిందా అని అడగటం చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించకపోవడంతో వైసీపీ కేడర్ కూచిపూడి - మొవ్వ రహదారిపై రాస్తా రోకో నిర్వహించింది.

  సీఐ జోక్యంతో

  సీఐ జోక్యంతో

  ఇంతలో సీఐ జనార్ధన్ రావు జోక్యం చేసుకొని ఫిర్యాదును స్వీకరించి, దర్యాఫ్తు చేస్తామని హామీ ఇవ్వడంతో వైసీపీ కేడర్ ఆందోళనను విరమించింది. త్వరలో అతనిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. కాగా, గతంలో ఫేస్‌బుక్‌లో అనుచిత ఫోటోలు పెట్టిన వారిని జైలుకు పంపిన విషయం తెలిసిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Youth posts objectional post on YSR Conress Party chief YS Jagan Mohan Reddy in Facebook.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి