జగన్‌కు షాక్: రాజీనామాకు అందరూ ఒకే కారణం చూపారు! రంగంలోకి నేతలు

Posted By:
Subscribe to Oneindia Telugu

నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాలిటీలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మురికి పాకాన పడింది. తొలుత కుదిరిన ఒప్పందం ప్రకారం మున్సిపల్ చైర్మన్‌ను మార్చాలని పలువురు కౌన్సిలర్లు పట్టుబడ్డారు. అది నెరవేరకపోవడంతో ఆరుగురు కౌన్సిలర్లు రెండ్రోజుల క్రితం రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: 'స్వరం మార్చిన రోజా, జగన్‌కు ఇబ్బందులు మొదలు, రాత్రుళ్లు మాట్లాడుకుంటున్నారు'

ఆరుగురు రాజీనామాల్లో ఐదుగురు అనారోగ్యాన్ని సాకుగా చూపించినట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా తాము బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నామని అందులో పేర్కొన్నారు. తొలుత 27వ వార్డు కౌన్సిలర్ రామిశెట్టి త్రివేణి అనారోగ్యంతో రాజీనామాను ప్రకటించారు.

చదవండి: అర్థంకాడు, నేనెవర్ని చెప్పడానికి: పవన్‌పై కేటీఆర్, అల్లు అర్జున్, సమంత, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌లపై

అనారోగ్యంతో అంటూ రాజీనామా

అనారోగ్యంతో అంటూ రాజీనామా

ఆ తర్వాత మరో ఇద్దరు గంగాభవానీ, రమాదేవిలు అనారోగ్యంతో ప్రజా సమస్యల పరిష్కారంలో పాలు పంచుకొనలేకపోతున్నందుకు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం మరో ఇద్దరు మహిళా కౌన్సిలర్లు అదే కారణంతో రాజీనామా చేశారు. 15వ వార్డు కౌన్సిలర్ రామయ్య కూడా రాజీనామా సమర్పించారు.

  YS Jagan Padayatra : 100 Questions To YSR Congress Party Chief
  రంగంలోకి ముఖ్య నేతలు

  రంగంలోకి ముఖ్య నేతలు

  వరుస రాజీనామాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గుబులు ప్రారంభమైంది. వెంటనే పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే మాట్లాడారని తెలుస్తోంది. అనారోగ్యం పేరుతో రాజీనామాలు సమర్పించిన వారితో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

  వైసీపీలో ముసలం

  వైసీపీలో ముసలం

  ఒకవేళ వారు రాజీనామాల కోసం గట్టిగా పట్టుబడితే కౌన్సిల్ ఆమోదిస్తుందా లేదా చూడాలి. కౌన్సెల్‌కు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా మరో ఆరు నెలలు ఆగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీలో ముసలంపై ఏం జరుగుతుందనే చర్చ స్థానికంగా సాగుతోంది.

  ఏం జరిగింది అసలేం ఏం జరిగింది

  ఏం జరిగింది అసలేం ఏం జరిగింది

  కాగా, నూజివీడు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి కోసం బసవా రేవతి, రామిశెట్టి త్రివేణి వర్గాలు నాడు పోటీపడ్డాయి. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. ఇద్దరూ చెరో రెండున్నర సంవత్సరాలు పదవి పంచుకోమని సూచించారు. మొదట అవకాశం బసవా రేవతికి వచ్చింది. ఒప్పందం ప్రకారం గడువు ముగిసినా పాలక పగ్గాలు రామిశెట్టి త్రివేణికి అప్పగించకపోవడంతో రగడ వచ్చింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress Party plunged into political crisis in Nuziveedu Municipality as 6 councillors elected from the party quit their posts.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి