అర్థంకాడు, నేనెవర్ని చెప్పడానికి: పవన్‌పై కేటీఆర్, అల్లు అర్జున్, సమంత, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌లపై

Posted By:
Subscribe to Oneindia Telugu
  పవన్‌, అల్లు అర్జున్, సమంత, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌లపై కేటీఆర్ !

  హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం రాత్రి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చారు. పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. వివిధ అంశాలపై స్పందించారు.

  చదవండి: కేసీఆర్ తప్పుచేశారు కానీ, ఏపీకి వెళ్లం, రేవంత్ ఎవరు, చీప్ క్యారెక్టర్లు: కేటీఆర్, 'పర్సనల్' చతుర్లు

  నటులు అల్లు అర్జున్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, నటీమణి సమంత తదితరుల గురించి మాట్లాడారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేనలకు ఓటు వేసేందుకు తనకు ఓటు హక్కు లేదని చెప్పారు.

  అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబుల గురించి

  అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబుల గురించి

  అల్లు అర్జున్ గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఎనర్జీ, స్టైల్ అని కేటీఆర్ ప్రశంసించారు. మరొకరు మహేష్ బాబు గురించి అడగగా.. స్క్రీన్ ప్రెసెన్స్ అన్నారు. ఇష్టమైన డైరెక్టర్ ఎవరని అడగగా.. ఆయా అంశాలను బట్టి చాలామంది ఉన్నారని చెప్పారు. ఇంకొకరు సినిమా గురించి అడగగా.. తనకు చాలా సినిమాలు ఇష్టమని చెప్పారు. ప్రభాస్ గురించి ఒక్క మాట చెప్పమని అడగగా.. బాహుబలి అన్నారు. తనకు ఇష్టమైన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అని తెలిపారు. జూ.ఎన్టీఆర్ గురించి చెప్పమని అడగగా. పర్ఫార్మర్ అన్నా

  పవన్ కళ్యాణ్ రాజకీయాలు డిసైడ్ చేసేందుకు నేనెవర్ని

  పవన్ కళ్యాణ్ రాజకీయాలు డిసైడ్ చేసేందుకు నేనెవర్ని

  పవన్ కళ్యాణ్ గురించి అడగగా ఎనిగ్మా అని కేటీఆర్ అన్నారు. ఎనిగ్మా అంటే ఎవరికీ అర్థం కాని వ్యక్తి అని అర్థం. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏమిటని ఓ నెటిజన్ అడగగా.. డిసైడ్ చేసేందుకు నేను ఎవరిని అని ప్రజలు డిసైడ్ చేస్తారని చెప్పారు.

  రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై

  రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై

  రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం చేసేలా కనిపిస్తోందని, దాని గురించి ఏమంటారని ఓ నెటిజన్ అడగగా... ప్రజలు నిర్ణయిస్తారని కేటీఆర్ చెప్పారు.

  సమంత గురించి అడగగా, క్రెకిటర్ల గురించి

  సమంత గురించి అడగగా, క్రెకిటర్ల గురించి

  నటి సమంత గురించి ఓ నెటిజన్ అడిగారు. సమంత గురించి ఒక్క మాట అని అడగగా. ఆమె మా హ్యాండ్లూమ్ అంబాసిడర్, మంచి, సున్నితమైన మనస్సు కలిగిన వారు అని చెప్పారు.
  ఇష్టమైన క్రికెటర్ గురించి అడగగా.. రాహుల్ ద్రావిడ్, ఇప్పుడు విరాట్ కోహ్లీ అని చెప్పారు. ధోనీ నుంచి ఏం నేర్చుకుంటారని ఒకరు ప్రశ్నించగా.. ఒత్తిడి సమయంలోను కామ్‌గా ఉండటం నేర్చుకుంటానని చెప్పారు. సచిన్ గురించి ఒక్క మాటలో చెప్పమని అడగగా.. లెజెండ్ అన్నారు.

  రాజకీయాల్లో గోల్స్ లేవు, ట్రిపుల్ తలాక్ బిల్లుపై

  రాజకీయాల్లో గోల్స్ లేవు, ట్రిపుల్ తలాక్ బిల్లుపై

  తాను ఏపీకి చెందిన వాడినని, కేసీఆర్ అంటే తనకు ఇష్టమని, 2019లో అద్భుత విజయం సాధిస్తారని ఓ నెటిజన్ చెప్పారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. ఎన్నికల గురించి ఆందోళన అవసరం లేదని, ప్రజలు తెలివైన వారని, పని చేసేవారిని ఎన్నుకుంటారని కేటీఆర్ చెప్పారు. తనకు రాజకీయాల్లో ప్రత్యేకమైన గోల్స్ ఏమీ లేవన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు గురించి అడగగా.. లోకసభలో ఇప్పటికే పాసయిందని చెప్పారు.

  హైదరాబాద్ పైనే దృష్టి పెట్టామనడం సరికాదు

  హైదరాబాద్ పైనే దృష్టి పెట్టామనడం సరికాదు

  తాము కేవలం హైదరాబాదు పైనే దృష్టి పెట్టామనడం సరికాదని, అన్ని జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించామని ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్ చెప్పారు. హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో హాట్‌స్పాట్స్ ఉన్నాయని చెప్పారు. హైదరాబాదున ప్రపంచ నగరంగా మార్చేందుకు ఐదు అంశాలు చెప్పారు. మెట్రో రైలు పాతబస్తీకి కూడా వస్తుందని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని కేటీఆర్ చెప్పారు. హైదరాబాదులో త్వరలో ఈవీ వాహనాలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. గుంటూరుకు చెందిన ఓ నెటిజన్ హైదరాబాద్ మెట్రోపై ప్రశంసలు కురిపించారు. ఎల్బీ నగర్ - మియాపూర్ మెట్రో 2018 జూన్‌కు ప్రారంభమవుతుందని చెప్పారు. హైటెక్ ఫ్లై ఓవర్ గురించి అడగగా. 2018 మధ్యలో వస్తుందని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Minister KT Rama Rao on Thursday night answered in twitter to netigens.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి