వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ తప్పుచేశారు కానీ, ఏపీకి వెళ్లం, రేవంత్ ఎవరు, చీప్ క్యారెక్టర్లు: కేటీఆర్, 'పర్సనల్' చతుర్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్‌, అల్లు అర్జున్, సమంత, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌లపై కేటీఆర్ !

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు తదితరుల గురించి నెటిజన్లు ప్రశ్నించగా స్పందించారు. రేవంత్ గురించి అడిగితే మాత్రం భిన్నంగా స్పందించారు.

చదవండి: పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి నేనెవర్ని అన్న కేటీఆర్

వచ్చే ఎన్నికల్లో గెలుపు, మంత్రి పదవితో సంతృప్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని విస్తరించే అంశం, హైదరాబాదులోని రోడ్లు, మంత్రి హరీష్ రావు పట్టుదల.. తదితర అంశాలపై ఆయన స్పందించారు.

కేసీఆర్, హరీష్ రావుల గురించి

కేసీఆర్, హరీష్ రావుల గురించి

సీఎం కేసీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పమని ఓ నెటిజన్ అడగగా.. సానుకూల ఫలితాలు సాధించే టాస్క్ మాస్టర్ అని చెప్పారు. తాను తన ఇంటి తలుపు తీయగానే తన పిల్లలు నవ్వుతూ ఉండాలన్నారు. హరీష్ రావు గురించి అడగగా.. మొండి పట్టుదల కలిగిన, కష్టపడే నాయకుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు ప్రజలు ఇస్తారని చెప్పారు.

ప్రధాని కలలు లేవు, కేసీఆర్ తప్పు చేశారు కానీ

ప్రధాని కలలు లేవు, కేసీఆర్ తప్పు చేశారు కానీ


మిమ్మల్ని ప్రధానిగా చూడాలనుకుంటున్నామని ఒక నెటిజన్ అడగగా.. తాను కలలో బతకనని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ బయోపిక్‌కు అంగీకరిస్తారా అని అడగగా... అది సీఎంను అడగాలన్నారు. కేసీఆర్ గతంలోను కాంగ్రెస్ నాయకుడు అని చెప్పగా.. తప్పులు అందరూ చేస్తారని, కానీ తెలివైన వారు తెలుసుకుంటారని చెప్పారు. తెలంగాణకు విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని చెప్పారు.

పర్సనల్ విషయాలు

పర్సనల్ విషయాలు

దేవుడిని నమ్ముతారా అని ఒకరు అడగగా.. తాను కర్మను నమ్ముతానని కేటీఆర్ చెప్పారు. తనకు ఇష్టమైన ఫుడ్ ఇండియన్, చైనీస్ అని చెప్పారు. అమెరికాలో ఉన్నప్పుడు తన ఫుడ్ తానే వండుకున్నానని కేటీఆర్ చెప్పారు. మంత్రిగా, నేతగా, తండ్రిగా, కొడుకుగా, భర్తగా.. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారని ప్రశ్నించగా.. ఇబ్బంది కానీ, పర్సనల్ లైఫ్ కొంత త్యాగం చేయక తప్పదన్నారు.

మోడీ, సోనియాలపై ఇలా, రేవంత్ ఎవరని ప్రశ్న

మోడీ, సోనియాలపై ఇలా, రేవంత్ ఎవరని ప్రశ్న

మోడీ, సోనియాలలో మోడీ, సోనియాలలో ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్నించగా.. దేశంలో రెండు పార్టీల సిస్టం ఉందని భావించడం లేదన్నారు. సోనియా రిటైర్ అయ్యారని చెప్పారు. రేవంత్ రెడ్డి గురించి చెప్పండని ఓ నెటిజన్ అడగగా. ఆయన ఎవరు అని ప్రశ్నించారు. రేవంత్ రోజు రోజుకు హద్దు మీరుతున్నారని, ఆయనకు గట్టి షాకివ్వాలని ఒకరు అడగగా. అన్నింటా చీప్ క్యారెక్టర్లు ఉంటాయని, వాటిని వదిలేయాలన్నారు.

కేటీఆర్ చతుర్లు

కేటీఆర్ చతుర్లు

మరో నెటిజన్ మోడీ గురించి ఒక్క మాటలో చెప్పమని అడగగా.. ప్రధానమంత్రి అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ కాకుండా ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అని అడగగా.. బరాక్ ఒబామా అని చెప్పారు. ఒకరు వన్ ప్లస్ వన్ అని అడగగా.. రాజకీయాల్లో రెండు మాత్రం కాదనని చెప్పారు. సిద్దిపేట గురించి చెప్పమని అడగగా... తన తండ్రి పుట్టిన ఊరు అని చెప్పారు. మీకు ఎవరిష్టం, వారి గురించి చెప్పండని ట్విట్టర్లో అడిగే స్టుపిడ్ రిక్వెస్ట్‌పై ఏమంటారని అడగగా.. వారి వారి ఇష్టమన్నారు. కొందరు కొన్ని అంశాలపై మాట్లాడగా... వాక్చాతుర్యం కాకుండా, స్పష్టమైన ప్రశ్న కావాలని సూటిగా చెప్పారు.

ఏపీలో ఓటు హక్కు లేదు, ఏపీలో విస్తరించం

ఏపీలో ఓటు హక్కు లేదు, ఏపీలో విస్తరించం

ఏపీలో ఓటు వేయాలనుకుంటే టీడీపీ, వైసీపీ, జనసేనలో దేనికి వేస్తారని అడగగా.. తనకు ఏపీలో ఓటు హక్కు లేదని కేటీఆర్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో (కేంద్రంలో) చేరుతారా అని ఓ నెటిజన్ అడగగా.. ఢిల్లీలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయని (కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు) అని కేటీఆర్ సరదాగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రశ్నించగా.. తెరాసను ఏపీకి విస్తరించే ఆలోచనలు తనకు తెలిసి అయితే లేవని, ఆంధ్రప్రదేశ్ ఒక సోదర రాష్ట్రమని కేటీఆర్ అన్నారు.

English summary
Telangana Minister KT Rama Rao on Thursday night answered in twitter to netigens on many issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X