LPG వినియోగదారులకు బిగ్ షాక్.. వెంటనే ఇలా చేయకపోతే గ్యాస్ కనెక్షన్ కట్..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దాంతో ప్రపంచ వాణిజ్య సరఫరాకు కీలకం అయిన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దాంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారత్ లోనూ పెట్రోల్, డీజిల్ తో పాటు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 10 రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. ఇక LPG గ్యాస్ సిలిండర్ సరఫరా, డెలివరీలో పలు కీలక మార్పులను చేసింది కేంద్ర ప్రభుత్వం.

మరోవైపు జూన్ 1 నుంచి ప్రభుత్వరంగ సంస్థలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను సిలిండర్ పై రూ. 42 నుంచి రూ. 53. 50 కు పెంచేసిన విషయం తెలిసిందే. అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. అయితే దేశంలోని ఎల్పీజీ వినియోగదారులందరూ రాబోయే 30 రోజుల్లో అంటే జూన్ 30, 2026 లోపు తమ గ్యాస్ కనెక్షన్ కు ఆధార్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. అలా చేయని పక్షంలో గ్యాస్ సేవలు నిలిచిపోవడంతోపాటు కనెక్షన్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది.

ఒకవేళ కేవైసీ చేయించుకోకపోతే ప్రభుత్వ రూల్స్ ప్రకారం మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే గ్యాస్ సబ్సిడీ డబ్బులు వెంటనే నిలిచిపోతాయి. అలాగే కొత్త సిలిండర్ బుక్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. లేదా బుకింగ్ పూర్తిగా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక దీర్ఘకాలికంగా రీఫిల్స్ ఆర్డర్ చేయని కనెక్షన్ లను అలాగే ఈ కేవైసీ లేని కనెక్షన్ లను నకిలీవిగా భావించి శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంది.

LPG Gas Connection Alert Complete Aadhaar eKYC within 30 days face immediate service cancellation

ఇక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ల విషయంలో ఈ కొత్త నిబంధన తీసుకురావడానికి గల కారణం చూస్తే.. గృహ అవసరాల కోసం ఇచ్చే సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు అక్రమంగా తరలించడం ఆగిపోతుంది. అలాగే ఒకే ఇంట్లో లేదా ఒకే వ్యక్తి పేరు మీద ఉన్న ఒక్కటి కంటే ఎక్కువ కనెక్షన్లను గుర్తించి తొలగించే అవకాశం ఉంది. ఇక ఎవరైతే ఇప్పటికే పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ కు మారారో.. వారు తమ పాత ఎల్పీజీ కనెక్షన్ ను విధిగా అప్పగించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+