అర్జున్ థియేటర్‌ లో రామ్ చరణ్ గుడి.. మెగా ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మేనియా నడుస్తోంది. మరికొద్ది గంటల్లో అంటే ఇవాళ రాత్రి 8 గంటల తర్వాత పెద్ది ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే బుకింగ్స్ జోరు కొనసాగుతోంది. ఆన్ లైన్ లో బుకింగ్ ఓపెన్ అయినప్పటి నుంచి గంటకు 50 వేల టికెట్స్ అమ్ముడవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని మాస్ రగ్గ్ డ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా సినిమా తెరకెక్కిన నేపథ్యంలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పెద్ది మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా..? అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

పెద్ది సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ కూకట్‌ పల్లిలోని అర్జున్ థియేటర్ వద్ద మెగా అభిమానులు చేసిన రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పెద్ది మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్‌ ను ప్రతిబింబించేలా థియేటర్ ఆవరణలోనే ఒక భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనికి 'శ్రీ రామ్‌ చరణ్ ఆలయం' అని ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. చరణ్ రస్టిక్ లుక్‌ ను అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ విగ్రహాన్ని చూడటానికి ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా ఒక పెద్ద జాతరను తలపిస్తోంది.

RamCharan Temple inside Kukatpally Arjun Theatre Mega Fans perform special rituals video goes viral

పెద్ది మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్​ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. పెద్ది సినిమా కూడా అదే రేంజ్ లో ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగ రాస్తుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+