జగన్ గురించి ఆరా: మోడీతో విజయసాయి భేటీ, చక్రం తిప్పుతున్నారా, బాబుకు షాకేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. వైకుంఠ ఏకాదశి రోజున పార్లమెంటులోని ప్రధాని చాంబర్లో ఉదయం పదకొండున్నర గంటలకు కలిశారు.

చదవండి: 'స్వరం మార్చిన రోజా, జగన్‌కు ఇబ్బందులు మొదలు, రాత్రుళ్లు మాట్లాడుకుంటున్నారు'

మోడీని ఆయన మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెబుతున్నారు. ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో విజయసాయి ఆయనకు అభినందనలు తెలియజేశారు.

చదవండి: బీజేపీతో బంధం: జగన్‌కు చింతా 'జీఎస్టీ' ఝలక్, 'సీఎం పదవి నుంచి రెండు కులాల వారు తప్పుకోవాలి'

మోడీకి సాయి శుభాకాంక్షలు, 15 నిమిషాల నుంచి 30 గంట భేటీ

మోడీకి సాయి శుభాకాంక్షలు, 15 నిమిషాల నుంచి 30 గంట భేటీ

ప్రధాని మోడీకి విజయ సాయి రెడ్డి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు వారు భేటీ అయ్యారు. రాష్ట్రంలోను పలు సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రధానికి వైసీపీ నేత విజ్ఞప్తి చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు.

  ఆస్తుల సంపాదనే బాబు లక్ష్యం
  జగన్ పాదయాత్రపై మోడీ ఆరా?

  జగన్ పాదయాత్రపై మోడీ ఆరా?

  ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర గురించి ప్రధానికి విజయసాయి వివరించారు. పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని కూడా చెప్పారని తెలుస్తోంది. ప్రధాని పాదయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు అడిగారని సమాచారం.

  ఏపీ రాజకీయాలపై చర్చ

  ఏపీ రాజకీయాలపై చర్చ

  దీంతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను విజయ సాయి రెడ్డి అడిగి ప్రధాని మోడీ తెలుసుకున్నారని తెలుస్తోంది. ఇరువురు పదిహేను నిమిషాల నుంచి అరగంట మధ్య భేటీ అయ్యారు. కాబట్టి వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. ప్రధానంగా ఏపీ రాజకీయాలపై చర్చించారని తెలుస్తోంది.

  నిన్న జగన్, నేడు విజయ సాయి రెడ్డి

  నిన్న జగన్, నేడు విజయ సాయి రెడ్డి

  ఈ భేటీపై పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోయినప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది గడువు ముందు మోడీ - విజయసాయి రెడ్డిల భేటీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రధానిని విపక్ష నేతలు కలవడం విషయమేమీ కాదు. కానీ గతంలో జగన్ ప్రధానిని కలిసినప్పుడు పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. టీడీపీ నేతలు జగన్‌తో పాటు ప్రధానిపై విమర్శలు చేశారు.

  బాబుకు షాక్, రాజకీయ అంశాలు?

  బాబుకు షాక్, రాజకీయ అంశాలు?

  ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ సాయి రెడ్డి భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ - టీడీపీ నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. బీజేపీ నేతలు టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు మౌనం పాటిస్తున్నారు. విజయసాయి కలయిక వెనుక రాజకీయ అంశాలు ఉన్నాయా? ఎన్నికలకు ముందు చంద్రబాబుకు మోడీ షాకిచ్చే పరిస్థితులు ఉన్నాయా? బీజేపీ మళ్లీ జగన్ వైపు అడుగులు వేస్తున్నారా? విజయసాయి చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారా? అనేవి ఈ భేటీతో చెప్పలేదు. అన్నీ ముందు ముందు తేలనున్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress Party MP Vijaya Sai Reddy on Friday has met Prime Minister Narendra Modi in his parliament chamber.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి