IPL 2026: పంజాబ్ కొంపముంచిన జాన్సన్.. ముంబైని గెలిపించిన తెలుగోడు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్నందుకుంది. గురువారం ధర్మశాల వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తెలుగు తేజం తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.

మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. మార్కో జాన్సెన్ చెత్త బౌలింగ్‌ పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించింది.

హీరోయిన్లందరూ నా ఫ్రెండ్సే.. భర్త రొమాంటిక్ సీన్లపై నటి షాకింగ్ కామెంట్స్!
హీరోయిన్లందరూ నా ఫ్రెండ్సే.. భర్త రొమాంటిక్ సీన్లపై నటి షాకింగ్ కామెంట్స్!

ముంబైని గెలిపించిన తెలుగోడు

201 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఒక బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసి గెలుపొందింది . తిలక్ వర్మ(33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ర్యాన్ రికెల్టన్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.

విల్ జాక్స్(10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25 నాటౌట్)దూకుడుగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(2/36) రెండు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్(1/32), మార్కో జాన్సెన్(1/55) చెరో వికెట్ తీసారు.

IPL 2026 Tilak Varma Masterclass and Jansen s Costly 18th Over Seal Thrilling MI Win Over PBKS

అంతకుమందు ముంబై ఇండియన్స్ బౌలర్లు శార్దూల్ ఠాకూర్(4/39), దీపక్ చాహర్(2/36) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులే చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) దూకుడుగా ఆడాడు. కార్బిన్ బోష్, రాజ్ బావకు చెరో వికెట్ దక్కింది.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..

201 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. అయితే మిడిల్ ఓవర్లలో ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్‌(20)తో కలిసి తిలక్ వర్మ నాలుగో వికెట్‌కు 61 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రూథర్‌ఫోర్డ్ ఔటవ్వడం.. ముంబై పరుగుల వేగం తగ్గడంతో విజయ సమీకరణం 18 బంతుల్లో 50 పరుగులుగా మారింది.

ఈ పరిస్థితుల్లో మార్కో జాన్సెన్ వేసిన 18వ ఓవర్‌ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ ఓవర్‌లో తిలక్ వర్మ వరుసగా 6, 4, 1, 4,1, 6 బాది 22 పరుగులు రాబట్టాడు. దాంతో ముంబై విజయానికి 12 బంతుల్లో 28 పరుగులే అవసరమయ్యాయి. జాన్సెన్ కాస్త కట్టడిగా బౌలింగ్ చేసి ఉంటే పంజాబ్ విజయం సాధించేది.

19వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ 13 పరుగులే ఇచ్చినా.. ఆఖరి ఓవర్‌లో గ్జేవియర్ బార్ట్‌లెట్ 15 పరుగులను డిఫెండ్ చేయలేకపోయాడు. ఈ ఓవర్‌ను విల్ జాక్స్ సిక్సర్‌తో ప్రారంభించగా.. తిలక్ వర్మ రెండు సిక్స్‌లతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. జాన్సెన్ రెండు బౌండరీలు ఇవ్వకుండా ఉంటే ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచేది.

RCB టాప్ లో నిలిచినా, ప్లే ఆఫ్స్ డౌటే - మారుతున్న లెక్కలు.. ఈ టీంలకే ఛాన్స్..!!
RCB టాప్ లో నిలిచినా, ప్లే ఆఫ్స్ డౌటే - మారుతున్న లెక్కలు.. ఈ టీంలకే ఛాన్స్..!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+