తెలంగాణ ఇంటర్ విద్యలో భారీ మార్పులు.. ఫస్ట్ ఇయర్ నుంచే..
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కీలక మార్పులు చేసింది ఇంటర్ బోర్డు. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. ఈ మేరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో ప్రాక్టికల్స్ నిర్వహించేలా విద్యాశాఖ మార్పులు చేసింది. ఫస్టియర్ లో 15, సెకండ్ ఇయర్ లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్ లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ను ప్రవేశపెట్టింది. మ్యాథ్స్ లో 75 మార్కులకు బదులు థియరీ ఎగ్జామ్ కు 60 మార్కులు, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కింద ఫస్టియర్ లో 15, సెకండ్ ఇయర్ లో 15 మార్కులు కేటాయిస్తారు. హ్యూమానిటీస్, లాంగ్వేజెస్ ల్లో ఇంటర్నల్స్ కు 20, పరీక్షలు 80 మార్కులకు నిర్వహిస్తారు.
బట్టీబట్టే విధానాన్ని తగ్గించి విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచేలా ప్రయోగాత్మక నైపుణ్యాలను పెంచడమే ఈ నూతన విద్యావిధానం లక్ష్యమని బోర్డు స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో ఇంటర్ ఫలితాలు గత నెల ఏప్రిల్ 12 న విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్ష రాసిన విద్యార్థులు మొత్తం 4,89,123 మంది కాగా.. ఉత్తీర్ణత 3,23,807 మంది సాధించారు. వీరిలో బాలురు 74.40 శాతం, బాలికలు 57.69 శాతం ఉన్నారు. ఫస్టియర్ ఓవరాల్ గా పాస్ పర్సెంటేజ్ 66.20 శాతం ఉంది.

ఇక ఇంటర్ సెకండియర్ లో పరీక్ష రాసిన విద్యార్థులు 5,07,948 మంది ఉన్నారు. వారిలో ఉత్తీర్ణత 3,58,490 మంది సాధించారు. బాలికల్లో 78.65 శాతం, బాలురలో 62.50 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండియర్ ఓవరాల్ పర్సెంటేజ్ 70. 58 శాతంగా ఉంది.












Click it and Unblock the Notifications