NEET paper leak: మరో ఇద్దరు అరెస్ట్.. ఏడుకు చేరిన అరెస్టులు

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మహారాష్ట్రకు చెందిన ధనంజయ్ లోఖండా, మనీషా వాఘ్మారే (పుణె)లను అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. గత 24 గంటల్లో, దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మే 3న జరిగిన నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలు, ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై విద్యా మంత్రిత్వ శాఖ ఫిర్యాదుతో మే 12న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో భారతీయ న్యాయ సంహిత కింద నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకం, దొంగతనం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి నేరాలు నమోదయ్యాయి.

అవినీతి నిరోధక చట్టం.. అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాలను నిరోధించే) చట్టం 2024 కింద కూడా నేరాలు నమోదయ్యాయి. అరెస్టైన ఏడుగురిలో జైపూర్ నుండి ముగ్గురు, గురుగ్రామ్, నాసిక్ నుండి ఒక్కొక్కరు, పుణె, అహల్యానగర్ నుండి ఇద్దరు ఉన్నారు. పలువురు అనుమానితులు ప్రస్తుతం విచారణలో ఉన్నారు. దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో తనిఖీలు చేసి, మొబైల్ ఫోన్‌లతో సహా కీలక ఆధారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు (SOG)తో సమన్వయం చేసుకుంటూ, సీబీఐ సాంకేతిక, ఫోరెన్సిక్ విశ్లేషణల ద్వారా అన్ని ఆధారాలను పరిశీలిస్తోంది.

లీకేజీ ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం మంగళవారం మే 3న జరిగిన నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేసింది. తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కేంద్ర ఏజెన్సీల సమాచారం, చట్ట అమలు సంస్థల నివేదికల ఆధారంగా పరీక్ష సమగ్రతపై ఆందోళనలు లేవనెత్తబడటంతో ఎన్‌టీఏ (NTA) ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

NEET UG 2026 Leak Scam CBI Arrests Dhananjay Lokhande and Manisha Waghmare from Pune NEET-UG 2026

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) 'వ్యవస్థాగత వైఫల్యం' పై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరీక్ష తిరిగి నిర్వహించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపట్టారు. దిల్లీలోని శాస్త్రి భవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు ఆందోళన చేసి కొందరు బారికేడ్‌ లను ఎక్కారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+