Live Video: దూసుకొచ్చిన మహా ప్రళయం, కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు..

పొరుగుదేశం నేపాల్‌లో ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. ఇటీవలే సంభవించిన ప్లాష్ ఫ్లడ్స్ నుంచి పూర్తిగా తేరుకోక ముందే మరోసారి ఆదివారం తెల్లవారుజామున ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. పర్వత ప్రాంతమైన గూర్ఖా జిల్లాలోని చుమ్నుబ్రీ గ్రామీణ పురపాలక సంఘం పరిధిలో కొండచరియలు విరిగిపడి బుధి గండ్కీ నది ప్రవాహానికి అడ్డుగా పడటంతో భారీగా నీరు నిలిచిపోయింది.

దీంతో ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో నది కట్టలు తెంచుకుని ఉగ్రరూపం దాల్చింది. ఉదయం 4 గంటల సమయంలో విరుచుకుపడిన ఈ ప్రచండ వరద తాకిడికి కొండ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన రాళ్లు, బురద రాశులు పల్లెలను ముంచెత్తాయి. ఈ భయానక ఘటనతో అనేక గ్రామాలు జలమయమై జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

Budhi Gandaki River Flash Floods Cause Widespread Havoc in Nepal Gorkha Rescue Operations Underway

చుమ్నుబ్రీ ప్రాంతంలో సంభవించిన ఈ ప్రకృతి విపత్తు వల్ల దాదాపు 40కి పైగా ఇళ్లు వరద ఉధృతికి ఊడ్చుకుపోయాయని అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. పయున్, జగత్, బగర్, సల్లేరి, ఘట్టిఖోలా వంటి ఐదు ప్రధాన నివాస ప్రాంతాలు ఈ వరద ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. నది ఒడ్డున ఉన్న గుడారాలలో నివసిస్తున్న నలుగురు వ్యక్తులు ఈ ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి ఆచూకీ లేకుండా పోయారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని స్థానిక పాలనాధికారులు వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి సల్లేరి వద్ద నిర్మాణంలో ఉన్న 341 మెగావాట్ల బుధి గండ్కీ జలవిద్యుత్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ క్యాంప్, నిర్మాణ యంత్రాలు కూడా నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి.

5,285 మంది మృతి? సెర్చ్ ఆపరేషన్ క్లోజ్.. వరద బాధితులకు వెంటనే ఇన్సూరెన్స్, క్యాష్!
5,285 మంది మృతి? సెర్చ్ ఆపరేషన్ క్లోజ్.. వరద బాధితులకు వెంటనే ఇన్సూరెన్స్, క్యాష్!

తెగిపోయిన వారధులు: నిలిచిపోయిన రాకపోకలు

నదీ పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో కొట్టుకుపోయిన వంతెనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. నయాక్‌చెట్ - సిర్దిబాస్ ప్రాంతాలను కలిపే స్ట్రక్చర్ సస్పెన్షన్ బ్రిడ్జ్ తో పాటు నయాక్‌చెట్ - ఫిలిమ్ బజార్‌ను అనుసంధానించే మరో కీలక వంతెన నీటి ప్రవాహంలో గాలిలో కలిసిపోయింది.

అలాగే ధార్చే పరిధిలో ఉన్న మచ్చాఖోలా - కేరౌజా మధ్య ఉన్న వంతెన, ఆరుఘాట్ పరిధిలోని సోతీ వద్ద ఉన్న మోటారబుల్ ఇనుప వంతెనలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో చుట్టుపక్కల అనేక గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

భారీ ప్రకృతి విపత్తు: మరోసారి నేపాల్ విలవిల: టిబెట్ నుంచే.. !!
భారీ ప్రకృతి విపత్తు: మరోసారి నేపాల్ విలవిల: టిబెట్ నుంచే.. !!

మైక్‌ల ద్వారా హెచ్చరికలు: సహాయక చర్యల్లో హెలికాప్టర్లు

ఆకస్మిక వరద ప్రమాదాన్ని పసిగట్టిన అటవీ, పోలీసు యంత్రాంగం మైక్‌ల ద్వారా మైదాన, దిగువ ప్రాంతాల ప్రజలను తక్షణమే అప్రమత్తం చేసింది. ఖోర్లాబేసి, మచ్చాఖోలా, సోతీ, అర్ఖేట్, ఆరుఘాట్ బజార్ ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజధాని ఖాట్మండు నుంచి రంగంలోకి దిగిన ప్రత్యేక సహాయక బృందాలు, హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశాయి. గూర్ఖా జిల్లా పరిపాలనాధికారి ధర్మేంద్ర కుమార్ మిశ్రా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+