శని జయంతి 2026: ఈ రాశులవారు శనిని శాంతింపజేయటానికి సిద్ధమవ్వండి!
హిందూ సంప్రదాయంలో శని జయంతికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కర్మఫలదాతగా, క్రమశిక్షణకు మారుపేరుగా భావించే శని దేవుడి అనుగ్రహం కోసం భక్తులు ఈ రోజున ప్రత్యేక పూజలు, దానాలు, పరిహారాలు చేస్తారు. 2026లో శని జయంతి మే 16న జరగనుండగా, ఈసారి శని గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఇది మరింత కీలకంగా భావిస్తున్నారు.
శని జయంతి.. ప్రత్యేక పరిహారాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ప్రభావం మనిషి జీవితంలో క్రమశిక్షణ, సహనం, కష్టం, న్యాయం వంటి అంశాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మేషం, సింహం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఈ శని జయంతి సందర్భంగా కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి, ఆర్థిక మరియు కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

మేష రాశి
మేషరాశి వారు శని జయంతి రోజున రావి చెట్టు వద్ద నువ్వుల నూనె దీపం వెలిగించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే మనసులో ఉన్న భయాలు, ఆందోళనలను వదిలించుకునేందుకు ధ్యానం చేయడం శుభప్రదంగా చెబుతున్నారు. మేషరాశి వారికి శని ప్రభావం ఉన్న కారణంగా శని జయంతి నాడు చేసే పరిహారాల ఫలితం సానుకూలంగా ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశివారికి ఈ కాలంలో భావోద్వేగ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాలభైరవ అష్టకం పఠించడం, నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వసిస్తున్నారు.సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్న కారణంగా వీరు శని జయంతి నాడు ఈ పరిహారాలు చేస్తే ఫలితం ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శని ప్రభావంతో ఇంటి మరియు కుటుంబ బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు వృద్ధులకు దుప్పట్లు లేదా అవసరమైన వస్తువులు దానం చేయడం, శని ఆలయంలో నూనె సమర్పించడం మంచిదని చెబుతున్నారు.
కుంభ రాశి
కుంభరాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. పేదలకు చెప్పులు దానం చేయడం, శనిదేవునికి నల్ల వస్త్రాలు సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చని అంటున్నారు.
మీన రాశి
శని ప్రభావం కారణంగా ఈ రాశివారిలో భావోద్వేగ మార్పులు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. మౌన ధ్యానం, హనుమాన్ చాలీసా పఠనం, అవసరమైన వారికి ఆహారం దానం చేయడం ద్వారా మానసిక బలం పెరుగుతుందని చెబుతున్నారు.
గమనిక: వ్యక్తిగత జాతక స్థితుల ఆధారంగా ఫలితాలు మారవచ్చని, పూర్తి వివరాల కోసం నిపుణులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications