నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుప్త నిధులకు బలి: మందుపార్టీలో వెలుగులోకి..

By Pratap
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: గుప్తనిధుల కోసం పూజారి మాటలు విన్న మిత్రులు ఘాతుకానికి పాల్పడ్డారు. నమ్మి వెంట వచ్చిన స్నేహితుడిని బలి ఇచ్చారు. నెల్లూరులో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఓ డీఎస్పీ కుమారుడి హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నెల్లూరు కలెక్టరేట్‌లో సర్వేయర్‌గా పని చేస్తున్న దొడ్డి ఆదినారాయణ కుమారుడు బత్తిబాబు సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు ఇటీవల రాశాడు.

అతని మిత్రుడు పవన్‌కుమార్‌కు నగరంలోని హరనాధపురంలో ఉన్న నాగసాయి మందిరంలో ఓ పూజారితో సంబంధాలు ఉన్నాయి. గుప్తనిధుల కోసం ఈ పూజారి నిత్యం పూజలు చేస్తుంటాడు. ఇటీవల పవన్‌కుమార్‌ పూజారి దగ్గర కూర్చుని ఫేస్‌బుక్‌ చూసుకుంటుండగా, అందులో బత్తిబాబు ఫొటోను పూజారి చూశాడు. ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి ని బలి ఇస్తే గుప్త నిధులు దొరికే అవకాశం ఉందనీ, అప్పులన్నీ తీరిపోయే అవకాశం ఉందని పవన్‌కుమార్‌కు పూజారి సూచించాడు.

Youth sacrificed for treasure hunt

ఈ మేరకు ఈ నెల 27న ఉదయం ఇంటర్నెట్‌ సెంటర్‌కు వెళదామని పవన్‌కుమార్‌ చెప్పడంతో బత్తిబాబు కలిశాడు. తన బైక్‌ నరసింహకొండ దగ్గర మరమ్మతులకు గురైందని, తనను అక్కడకు తీసుకెళ్లాలని బత్తిబాబుతో అన్నాడు. దీంతో బత్తిబాబు తన బైక్‌పైనే పవన్‌కుమార్‌ను నరసింహకొండ తీసుకెళ్లాడు. అక్కడే పవన్‌కుమార్‌ మరికొందరు కలిసి బత్తిబాబును ఓ గిరి గీసి గీతలో కూర్చోబెట్టారు. మాట్లాడుతున్న సమయంలో బండరాయితో మోది బత్తిబాబును హత్య చేశారు. అదే రోజు రాత్రి నెల్లూరు అయ్యప్పగుడి సెంటర్‌లోని ఓ హోటల్‌లో పవన్‌కుమార్‌, స్నేహితులు రేవంత్‌ ,నరసింహారెడ్డి, సాయితేజా ఇంకొందరు ఓ గదిని అద్దెకు తీసుకుని మద్యం సేవించారు. ఆ సమయంలో అసలు విషయం బయటకు వచ్చింది.

అప్పటివరకు బత్తిబాబు అదృశ్యంపై నాలుగో నగర పోలీసులు ఫోన్‌ నెంబర్లు, స్నేహితుల ఆధారంగా విచారణ చేపట్టారు. సీఐ మాణిక్యారావు స్నేహితులను పిలిపించి వేర్వేరుగా విచారించారు.
దీంతో చిన్న క్లూ పోలీసులకు దొరికింది. పవన్‌కుమార్‌ మందు తాగిన తరువాత మాట్లాడుతుండగా విన్నామని రేవంత్‌ పోలీసుల ముందు బయటపెట్టాడు.

దీంతో పవన్‌ను పోలీసులు పట్టుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. నెల్లూరు తహసీల్దారు జనార్దన్‌ బత్తిబాబు మృతదేహాన్ని సందర్శించారు. సోమవారం ఈ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

English summary
Friends sacrificed a boy for treasure hunt in Nellore district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X