వైసీపీ డిసైడ్ అయింది, ఇక తగ్గేదేలే - వారికి కీలక బాధ్యతలు..!!
ఏపీ ఎన్నికల రాజకీయం పైన క్లారిటీ వస్తోంది. ఎవరెటువైపో అధికారికంగా చెప్పకపోయినా..సంకేతాలు క్లియర్ గా ఉన్నాయి. మూడు పార్టీలు వర్సస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయ యుద్దం కొనసాగనుంది. ఇప్పటికే ఒక విధంగా ఆరంభమైంది. విజయం పైన ధీమాతో ఉన్న వైసీపీ ఇక ఎక్కడా తగ్గకూడదని నిర్ణయించింది. ఎవరు సీఎం జగన్.. ప్రభుత్వం..పార్టీ పైన ఆరోపణలు చేసినా తిప్పికొట్టాల్సిందేనని డిసైడ్ అయింది. ప్రజాక్షేత్రంలో సై అంటే సై అంటోంది. ముఖ్య నేతలను రంగంలోకి దించుతెంది.
ఒకే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలు : ఏపీలో సీఎం జగన్ లక్ష్యంగా ప్రత్యర్ధి పార్టీలు ఏకం అవుతున్నాయి. ఎవరి దారి వారిదే అన్నట్లుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నా..లక్ష్యం మాత్రం ఒక్కటేనని స్పష్టం చేస్తున్నాయి. ఈ పార్టీలన్నీ సీఎం జగన్ టార్గెట్ గా ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. నాలుగు వైపులా జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలనేది వారి వ్యూహం. దీనిని ఎదుర్కోవటానికి వైసీపీ సిద్దం అయింది.

బీజేపీ అధ్యక్షుడు నడ్డా మొదలు..చంద్రబాబు...పవన్ కల్యాణ్ వరకు ఎవరు ఆరోపణలు చేసినా తిప్పి కొట్టి తాము ప్రజలకు చేసామో ప్రజలకు వివరించేలా పార్టీ ఫైర్ బ్రాండ్స్ ను రంగంలోకి దించుతోంది. అందులో సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవసరమైన సందర్భాలలో ఢిల్లీలోనూ స్పందించేలా కార్యాచరణ సిద్దం చేస్తోంది.
సీఎం జగన్ టార్గెట్ రాజకీయం : టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ కు వ్యతిరేకంగా తన కూటమిని సిద్దం చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే మద్దతిచ్చే పార్టీలతో ఒక ఒప్పందానికి వచ్చారు. అందరూ ఇప్పుడు వైసీపీ ప్రభుతాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ నుంచి కౌంటర్ ఎటాక్ సీరియస్ గా మొదలైంది. బీజేపీతో సన్నిహిత సంబంధాలు..రకరకాల ప్రచారాలు ప్రతిపక్షాలు చేస్తన్న సమయంలో..జేపీ నడ్డా కామెంట్స్ పైన మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ గా స్పందించారు.
కర్ణాటక ఓటమిని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ భూముల వ్యవహారాన్ని నిలదీసారు. 2014లో టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన నాడు బీజేపీ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. దీనికి బీజేపీ నుంచి స్పందన లేదు. బీజేపీ..వైసీపీ ఎప్పుడు కలిసి ఉందని మాత్రమే ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీతో తమకు బంధం ఉండదనీ చెప్పటం లేదు.

తిప్పి కొట్టాల్సిందే : ఇక, పేర్ని నాని ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలోనూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వారాహి యాత్ర తొలి రోజున పవన్ చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒక చెప్పు చూపిస్తూ రెండు చెప్పులు చూపిస్తామంటూ హెచ్చరించారు. పవన్ వైసీపీని హెచ్చరిస్తూ చేస్తున్న వ్యాఖ్యలను కౌంటర్ గా పవన్ డ్రామాలు చేస్తే మక్కెలిరగదీస్తామని పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయానికి ప్రతిపక్షాల మాటల దాడి పెరిగే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది.
దీంతో..ప్రతిపక్షాల విమర్శల పైన ఎప్పటికప్పుడు అదే తరహాలో తిప్పి కొట్టటానికి ఒక టీంను సిద్దం చేస్తోంది. విజయ సాయిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్సా, భూమన కరుణాకర రెడ్డి, రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, విడదల రజనీతో పాటుగా మరి కొందరిని ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే తిప్పి కొట్టే అంశంలో ఆలోచన అవసరం లేదని పార్టీ స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications