అక్రమ సంబంధాలతోనే వివేకా హత్య ? బెయిల్ పిటిషన్లో వైఎస్ అవినాష్ రెడ్డి షాకింగ్ ఆరోపణలు..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా చేర్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ హైకోర్టులో ఇవాళ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో ఆయన షాకింగ్ అభియోగాలు చేశారు. ఇందులో వివేకా అక్రమ సంబంధాల కారణంగానే ఆయన హత్య జరిగిందంటూ మరో వాదన తెరపైకి తెచ్చారు.

ys avinash reddy

తెలంగాణ హైకోర్టులో ఇవాళ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్యకు ఆయన అక్రమ సంబంధాలే కారణమన్నారు. ఆయన హత్య నిందితుల్లో ఒకరి తల్లి, మరొకరి భార్యతో వివేకాకు అక్రమసంబంధాలు ఉండేవన్నారు. అలాగే వివేకా రెండో భార్యకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఆయన హత్యకు కారణమైందన్నారు.

వివేకా ఆయన రెండో భార్య షమీంతో నడిపిన ఆర్ధిక లావాదేవీల్ని కూడా అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్లో ప్రస్తావించారు. రెండో భార్యకు వివేకా ఇచ్చిన ప్రాధాన్యం వల్ల సునీతతో మనస్పర్ధలు వచ్చాయన్నారు. అలాగే రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, అలాగే దాని పక్కనే విల్ల కొనుగోలు చేసి ఇస్తానన్నారు. మరోవైపు వివేకా రెండో భార్య పేరుతో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసేందుకు సిద్ధం కావడం కూడా హత్యకు కారణంగా అవినాష్ తన పిటిషన్లో పేర్కొన్నారు.

ys avinash reddy

వివేకా అక్రమ సంబంధాల కారణంగా జరిగిన ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి తెలిపారు. అలాగే ఈ హత్యకు వివేకా కుమార్తె సునీత, స్ధానిక ఎమ్మెల్సీ (బీటెక్ రవి), విపక్ష నేతతో కలిసి చేసిన కుట్ర కారణమని కూడా పేర్కొన్నారు. తద్వారా వీరంతా కలిసి ఈ హత్య చేసి తనపై అభియోగాలు మోపుతున్నట్లు అవినాష్ రెడ్డి చెప్పినట్లయింది. దీనిపై తెలంగాణ హైకోర్టు ఈ మధ్యాహ్నం విచారణ జరిపి ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చే అంశంపై ఓ నిర్ణయం తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+