షర్మిల,సునీతపై అవినాశ్ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ప్రచారం చివరి దశలో ఉంది. ముఖ్యనేతలు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీ ఈ రోజు ఏపీలో ప్రచారం చేస్తున్నారు. ప్రతీ సీటులో గెలుపే లక్ష్యంగా పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. కడప లో రాజకీయ పోరు ఈ సారి ఆసక్తి కరంగా మారింది. వైఎస్ కుటుంబ సభ్యులు పార్టీల వారీగా చీలిపోయారు. దీంతో..ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ కొనాసాగుతోంది. ఈ సమయంలో షర్మిల గురించి అవినాశ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
చంద్రబాబు ట్రాప్ లో
తన ఇద్దరు అక్కలు చంద్రబాబు ట్రాప్‌లో పడిపోయారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. షర్మిల, సునీత ఇద్దరూ బాబు డైరెక్షన్లో వీళ్లు నడుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా వైయస్ జగన్ మోహన్ రెడ్డికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తనకు తోడుగా ఉండాలని ప్రజలను కోరారు. ఇదే సమయంలో అవినాష్ రెడ్డి వైయస్ వివేకా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపైన అనవసరంగా వైయస్ వివేకా హత్య కేసు మోపారని.. తనను, తన తండ్రిని చాలా ఇబ్బందులకు గురి చేశారని వైయస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజా మద్దతు ఉంది
జైల్లో తన తండ్రిని కలిసినప్పుడల్లా.. తనకు తెలిసి జీవితంలో ఎవరికి ఏ పాపం చేయలేదని.. దేవుడు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు.. ఎందుకు ఇలా జరుగుతోంది అని నాతో అంటూ బాధపడేవాడరని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇటీవల తన తండ్రికి బెయిల్ వచ్చిందన్నారు. దయచేసి ప్రజలు చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా వైయస్ జగన్ మోహన్ రెడ్డికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తనకు తోడుగా ఉండాలని ప్రజలను కోరారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ వచ్చేలా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
గుండె గట్టిది
ఏ తప్పు చేయనప్పుడు భగవంతుడు ఎల్లప్పుడూ తోడుంటాడు.. తాత్కాలికంగా కష్టాలు వచ్చినా వాటి వల్ల ఇబ్బంది కలగకుండా దేవుడు తోడుంటాడు.. ఇది తాను నమ్మిన సిద్ధాంతమన్నారు. తాను సౌమ్యుడిని కావచ్చు..తన మాట మెత్తగా రావచ్చు కానీ తన గుండె గట్టిది.. ఎన్నింటినైనా ఎదుర్కొనే ధైర్యం తనకు ఉందని చెప్పారు. ఎన్ని వచ్చిన ఎదురు నిలబడతా.. అని వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications