షర్మిల ఆశలపై నీళ్లు చల్లిన భారతి - కొత్త సమీకరణం..!!
ఏపీలో ఎన్నికల వేళ కడప రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. దశాబ్దాల కాలంగా ఏకపక్షంగా సాగుతున్న కడప ఎన్నికలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కడప ఎంపీగా పీసీసీ చీఫ్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తన అన్న జగన్ లక్ష్యంగా షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు జగన్ ఓటమి లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో పులివెందుల నుంచి భారతి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
భారతి ప్రచారం
ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతి పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి వెళ్తున్నారు. అయిదేళ్ల కాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలను వివరిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వైయస్ జగన్ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని, ప్రజలందరికీ మేలు జరగడం ఆనందంగా ఉందన్నారు. నవరత్నాల ప్లస్ పేరుతో సీఎం వైయస్ జగన్ మేనిఫెస్టో విడుదల చేశారని, అందులోని అంశాలను మా బిడ్డ జగన్ అమలు చేస్తాడని ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు.

షర్మిల పోటీతో
గత ఎన్నికల ప్రచార సమయంలో ఇళ్లు, పెన్షన్, రేషన్ కార్డు కావాలని, చదువుకు సాయం, వైద్యానికి సాయం కావాలని చాలా అర్జీలు వచ్చాయని, ఈసారి అలాంటి దరఖాస్తులు రావడం లేదన్నారు. అన్నీ పారదర్శకంగా అమలువుతున్నాయి కాబట్టి అర్జీలు పెట్టుకునే అవకాశం లేదన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో మహిళా సాధికారత చాలా బాగుందని, అది కొనసాగుతుందని చెప్పారు. ఇదే సమయంలో ఎంపీ అభ్యర్దిగా అవినాశ్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. జగన్ కుటుంబ సభ్యులు పులివెందులలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు.
మారుతున్న లెక్కలు
షర్మిల - సునీత వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ అవినావ్ - జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.నామినేషన్ సమయంలో జగన్ ఈ ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలో పులివెందుల నుంచి మెజార్టీ ఓటింగ్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా జగన్ కు ఓటింగ్ జరిగినా..వైఎస్ కుమార్తెగా ఎంపీగా తనకు ఓట్లు దక్కుతాయనే అంచనాతో ఉన్నారు. అక్కడ అవినాశ్ ఓటింగ్ తగ్గించాలనే వ్యూహంతో పని చేస్తున్నారు. అయితే, భారతితో సహా వైఎస్ కుటుంబ సభ్యలు ప్రచారం వేళ..ఓటర్ల మూడ్ స్ఫష్టమవుతోంది. పులివెందులలోనే షర్మిల ఆశల పైన భారతి నీళ్లు చల్లుతున్నారనే ప్రచారం స్థానికంగా మొదలైంది.












Click it and Unblock the Notifications