చంద్రబాబు, ఎన్నికల ఫలితాల పై భారతి కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. గెలుపు కోసం ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. కడప జిల్లాలో ఈ సారి ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులు రెండు పార్టీల నుంచి బరిలో ఉన్నారు. ఇప్పుడు జగన్ సతీమణి భారతి పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. అటు షర్మిల, సునీత కాంగ్రెస్ తరపున ప్రచారం కొనసాగిస్తున్నారు.
భారతి ప్రచారం
ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతి పులివెందులలో ప్రచారం ప్రారంభించారు. జగన్ కు గత ఎన్నికల కంటే ఈసారి మంచి మెజారిటీ ఇవ్వాలని పులివెందుల ప్రజలు నిర్ణయించారని వ్యాఖ్యానించారు. తాజాగా చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన భారతి స్పందించారు. జగన్..రేపు నిన్ను చంపితే ఏమవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యల పైన భారతి స్పందించారు.చంద్రబాబు వయసులో పెద్దవారని..అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం తప్పన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని భారతి చెప్పుకొచ్చారు.

చంద్రబాబు వ్యాఖ్యలు తప్పు
ఒక వ్యక్తిని చంపాలనుకోవటం తప్పని భారతి వ్యాఖ్యానించారు. ప్రజలను మెప్పించుకోవాలని..తొలిగించుకోవాలనుకోవటం సరి కాదన్నారు. ఇక..ప్రచారంలో భాగంగా కుటుంబ సభ్యులు వైఎస్ సమతారెడ్డి, చవ్వా సునీతారెడ్డితో కలిసి ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులకు పులివెందులలో మండలాల వారీగా ప్రచార, సమన్వయ బాధ్యతలను అప్పగించారు. పులివెందులలో తమకు ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తోందని భారతి చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి స్పందన బాగుంది అని వివరించారు.
జగన్ చెబితే చేస్తారంతే
సీఎం జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టో, టీడీపీ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోపై పైనా స్పందించారు. జగన్ చెప్పారంటే చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని... చంద్రబాబు చెబితే చేస్తాడో, చేయడో అనే సందేహం ఉంటుందని వైఎస్ భారతి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ ఉన్నప్పటి నుంచి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని, ఇవాళ కూడా రొటీన్ గానే ప్రచారానికి వచ్చానని చెప్పారు. అటు కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుండటంతో భారతి తన ప్రచారంలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక..షర్మిల సైతం త్వరలో పూర్తి స్థాయిలో కడపలో ఎన్నికల ప్రచారం పైనే ఫోకస్ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications