వైఎస్సార్ ఘాట్ సాక్షిగా జగన్, షర్మిల - ఎమోషనల్...!!
వైఎస్సార్ వర్దంతి వేళ మాజీ సీఎం జగన్ నివాళి అర్పించారు. రాజశేఖర్‌రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తల్లి విజయమ్మతో కలిసి నివాళి అర్పించిన జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తన ఎక్స్ ఖాతాలో 'డాడ్.. మిస్ యూ' అనే ఓ సందేశం ఉంచారు.
తమ తండ్రి వైఎస్సార్ కు నివాళి అర్పించేందుకు ముందుగానే జగన్, షర్మిల పులివెందుల చేరుకున్నారు. జగన్ మూడో రోజులుగా పులివెందులలోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం జగన్ ముందుగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ఆ తరువాత విజయవాడకు బయల్దేరారు. షర్మిల సైతం తన తండ్రికి నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఇద్దరూ వేర్వేరుగానే నివాళి అర్పించారు. వైఎస్సార్ కు కాంగ్రెస్, వైసీపీ నేతలు నివాళి అర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.


వైఎస్ రాష్ట్ర అభివృద్ధి మరిచిపోలేనిదని షర్మిల పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలు ఒక్కటి అమలు కావడం లేదన్నారు. వైఎస్సార్ లాంటి పాలకులు మళ్లీ లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయినా ప్రత్యేక హోదా రాలేదన్నారు. కడప స్టీల్ వైఎస్సార్ కలగా చెప్పుకొచ్చారు. అభివృద్ధిని బాబు,జగన్ నీరు గార్చారన్నారు. జగన్ కడప బిడ్డ అయ్యి ఉండి ఇక్కడ అభివృద్ధి లేదని విమర్శించారు. బీజేపీ ని వైఎస్సార్ వ్యతిరేకించారన్నారు. జగన్ మాత్రం బీజేపీ తో దోస్తీ కట్టారని షర్మిల విమర్శించారు.












Click it and Unblock the Notifications