జగన్, షర్మిల రాజీ - ఇదీ ఒప్పందం, బిగ్ టర్న్..!!
అవును. అన్నా, చెల్లి రాజీ పడ్డారు. కొద్ది రోజులుగా బెంగళూరు కేంద్రంగా జరుగుతున్న రాజీ చర్చలు ఫలించాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ తన పరాజయం పై ప్రభావం చూపిన అంశాల పై ఫోకస్ చేసారు. పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టారు. షర్మిల పరంగా జరిగిన నష్టం గుర్తించారు. ఫలితంగా జగన్ - షర్మిల మధ్య రాజీ చర్చలకు ఇద్దరు పెద్దలు చొరవ తీసుకున్నారు. ఎట్టకేలకు రాజీకి వచ్చారు. రాజకీయంగా ఇప్పుడు ఈ ఇద్దరు తీసుకునే నిర్ణయం ఏపీలో ఆసక్తి కరంగా మారుతోంది.
అన్నా - చెల్లి రాజీ
ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయంలో షర్మిల వ్యవహారం ఒక ప్రధాన కారణం. అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల అక్కడ రాజకీయంగా ఎదగటంలో విఫలమయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. ఏపీలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. తొలి రోజు నుంచే అన్న జగన్ పైన గురి పెట్టారు. ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయ్యే వరకూ షర్మిల తన అన్న ఓటమే లక్ష్యంగా పని చేసారు. కూటమి కంటే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఇక.. జగన్ తన ఓటమికి కారణాల విశ్లేషణ..దిద్దుబాటులో భాగంగా పార్టీతో పాటుగా కుటుంబంలోనూ తీసుకోవాల్సిన నిర్ణయాల పైన కసరత్తు ప్రారంభించారు.

రాజీ ప్రతిపాదనలతో
అందులో భాగంగా షర్మిలతో రాజీ చేసుకోవాలని నిర్ణయించారు. రాజకీయంగా..కుటుంబ పరంగా జగన్ - షర్మిలతో దగ్గరగా ఉండే ఇద్దరు "పెద్దలు" రంగంలోకి దిగారు. బెంగళూరు కేంద్రంగా కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. జగన్ ఎన్నికల ఫలితాల తరువాత వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ.. మిగిలిన రోజులు బెంగళూరులో ఉంటున్నారు. అక్కడే అన్నా - చెల్లి మధ్య చర్చలు పలు విడతలుగా జరిగాయి. ముందుగా జగన్ - షర్మిల మధ్య ఆర్దిక పరమైన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చర్చల సమయంలో షర్మిల కోరిన విధంగా
ఆస్తిలో వాటాలు పంచుకోవాలని డిసైడ్ అయ్యారు.
వాట్ నెక్స్ట్
పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్యనే ఈ చర్చలు జరిగాయి. రెండు అంశాల్లో మినహా ఆస్తుల అంశాల్లో ఇద్దరి మధ్య దాదాపు రాజీ పూర్తయిందని సమాచారం. ఆర్దిక పరమైన వివాదాలకు ముగింపు పలకాలని ఇద్దరూ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో ఉండటతో..జగన్ ఇండియా కూటమి వైపు వెళ్తారనే ప్రచారం సాగింది. కానీ, జగన్ కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్దంగా లేరని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. జమిలి ఎన్నికల ప్రచారం వేళ..పార్టీలో దిద్దుబాటు చర్యలతో పాటుగా.. తనను డామేజ్ చేసిన అంశాలను సరి దిద్దుకోవాలని..ఆ తరువాతనే ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. అయితే.. ఇప్పుడు జగన్ - షర్మిల తాజా రాజీతో రానున్న రోజుల్లో ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి రాజకీయంగా మొదలైంది.












Click it and Unblock the Notifications