Ramoji Rao: వైఎస్సార్ కుటుంబం సంతాపం
Ramoji Rao: ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, ప్రముఖ నిర్మాత రామోజీ రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 3:45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 5వ తేదీన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. శుక్రవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై రామోజీ రావుకు కృత్రిమ శ్వాసను అందించారు డాక్టర్లు. వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు.

తెలుగునాట మీడియా మొఘల్‌గా ఎదిగారు రామోజీ రావు. ఈనాడు దినపత్రిక, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలతో మీడియా రంగంలో సంచలనం సృష్టించారు. తనదైన ముద్ర వేశారు. తన పేరు మీద దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించారు. ప్రియా పేరుతో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ సెగ్మెంట్‌లోనూ ఆయన అడుగులు వేశారు. అక్కడా విజయవంతం అయ్యారు.
రామోజీ రావు మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
అక్షర యోధులు, అనేక రంగాలలో అద్భుతమైన విజయాలు అందుకుని, భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన విశిష్టమైన వ్యక్తి, శ్రీ రామోజీ రావు గారి మరణం అత్యంత విషాదకరం. అయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/OBjHNggPIP
— YS Sharmila (@realyssharmila) June 8, 2024
రామోజీ రావు మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల.. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2024
అక్షర యోధుడిగా రామోజీ రావును అభివర్ణించారు షర్మిల. అనేక రంగాలలో అద్భుతమైన విజయాలను అందుకున్నారని, భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన మరణం అత్యంత విషాదకరమని చెప్పారు. రామోజీ రావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వైఎస్సార్, రామోజీ రావు ఉన్న ఫొటోను షర్మిల తన ట్వీట్‌కు జత చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications