ఎట్టకేలకు సజ్జల పై జగన్ వేటు..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా జగన్ పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి అనుబంధ సంఘాల వరకు మార్పులు చేస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న వారి పైన ఫోకస్ చేసారు. ఎన్నికల తరువాత కేడర్ నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సజ్జల పైన జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ ప్రక్షాళన
ముఖ్యమంత్రి జగన్ పార్టీకి అధికార ప్రతినిధులతో పాటుగా పలువురికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. గతంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉంటూ ఎన్నికల సమయంలో ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసిన వారికి తిరిగి వారి సొంత నియోజకవర్గాల సమన్వయ కర్తలుగా నియమిస్తున్నారు. అదే సమయంలో అనుబంధ సంఘాలకు బాధ్యలను ఖరారు చేసారు. ఇదే సమయంలో తాజాగా పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను దొడ్డి అంజిరెడ్డికి అప్పగించారు.

జగన్ వరుస నిర్ణయాలు
ఇప్పటి వరకు పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ వ్యవహరించారు. ఎన్నికలు పూర్తయిన సమయం నుంచి సజ్జల రామక్రిష్ణారెడ్డి తో పాటుగా భార్గవం తీరు పైన పార్టీ కేడర్ ఆగ్రహంతో ఉంది. పలువురు పార్టీ నేతలు సజ్జల వ్యవహరించిన తీరు కూడా పార్టీ ఓటమికి కారణంగా ఓపెన్ గానే వ్యాఖ్యానించారు. జగన్ కోటరీలో సజ్జల తీరు నష్టం చేసిందని ఆరోపణలు చేసారు. అదే విధంగా పార్టీ సోషల్ మీడియా నిర్వహణలో భార్గవ్ తీరు పైన విమర్శలు ఉన్నాయి. భార్గవ్ ను తప్పిస్తారని కొంత కాలంగా పార్టీలో ప్రచారం సాగుతోంది.
భార్గవ్ స్థానంలో
ఇప్పుడు తాజాగా భార్గవ్ స్థానంలో జగన్ కొత్తగా అంజిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి భార్గవ్ పైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం సాగింది. దీంతో, సజ్జల ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసారు. అయితే..సోషల్ మీడియా నిర్వహణ ప్రస్తుతం కీలకంగా మారటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సజ్జల రామక్రిష్ణారెడ్డి పాత్ర పార్టీ అధినేత జగన్ పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పార్టీ పరంగా మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications